kumaram bheem asifabad-తెగుళ్లను విశ్లేషించే మొబైల్ యాప్
ABN , Publish Date - Oct 16 , 2026 | 10:32 PM
పంటలను ఆశించే చీడపీడల నివారణకు సత్వర సలహాలు, సూచనలు పొందడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఓ యాప్ను అందుబాటు లోకి తెచ్చింది. వ్యవసాయ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్, స్టోరేజ్ కార్యాలయం, ఐసీఏఆర్ శాస్త్రవేత్తల సహకారాంతో నేషనల్ పెస్ట్ సర్వె లెన్స్ సిస్టమ్ (ఎన్పీఎస్ఎస్) పేరిట జాతీయ చీడపీడల నిఘా వ్యవస్థ అనే మొబైల్ యాప్ను అందుబాటు లోకి తెచ్చింది.
- ‘ఎన్పీఎస్ఎస్’తో రైతులకు ప్రయోజనం
వాంకిడి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): పంటలను ఆశించే చీడపీడల నివారణకు సత్వర సలహాలు, సూచనలు పొందడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఓ యాప్ను అందుబాటు లోకి తెచ్చింది. వ్యవసాయ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్, స్టోరేజ్ కార్యాలయం, ఐసీఏఆర్ శాస్త్రవేత్తల సహకారాంతో నేషనల్ పెస్ట్ సర్వె లెన్స్ సిస్టమ్ (ఎన్పీఎస్ఎస్) పేరిట జాతీయ చీడపీడల నిఘా వ్యవస్థ అనే మొబైల్ యాప్ను అందుబాటు లోకి తెచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సంటలకు హాని చేసే పురు గులు, చీడపీడలను ఈ వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తారు.
- ప్రధానంగా మూడు..
ఈ యాప్లో ప్రధానంగా మూడు విభాగాలు ఉన్నాయి. చీడపీడల గుర్తింపు విభాగం( ఫేస్ట్ ఐడెంటిఫికేషన్ మాడ్యుల్), చీడపీడల నిఘా విభా గం( పేస్ట్ సర్వె లైన్ మాడ్యుల్), సలహాల విభాగం (అడ్వైజరీ మాడ్యుల్) చీడీపీడల గుర్తింపు విభాగంలో 60 పంటలకు సోకే చీడపీడలు, తెగుళ్లను గుర్తించవచ్చు. రైతు నేరుగా మొబైల్ ద్వారా పురుగు లేదా తెగుళ్ల చిత్రాన్ని తీసి యాప్లో అప్లోడ్ చేస్తే వెంటనే పురుగు లేదా తెగులును గుర్తించి దాని లక్షణాలు, చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల సమాచారా న్ని అందజేస్తుంది. చీడపీడల నిఘా విభాగంలో ప్రస్తుతానికి వరి, పత్తి, సోయా, మిర్చి, మొక్కజొన్న, వంగ, దానిమ్మ, ఆపిల్, అరటి, ద్రాక్ష, మామిడి, కంది, చెరకు, టమాట, మినుము, గోధుమ పంటలలో కీలకమైన పురుగులు, తెగుళ్ల ఉధృతి సమాచారాన్ని సమోదు చేయవచ్చు. రాబోయే కాలంలో మిగిలిన పంటలను కూడా చేర్చే అవకాశామున్నట్లు చెబుతున్నారు.
- ప్రయోజనాలు ఇలా..
ఈ యాప్వల్ల సకాలంలో చీడపీడలను గుర్తించి నివారణకు సత్వర సమాచారాన్ని పొందవచ్చు. రైతులకు ఖర్చులు తగ్గి దిగుబడులు పెరిగి తద్వారా లాభాలు అర్జించే అవకాశం ఉంటుంది. వలస పురుగుల వ్యాప్తిని త్వరగా కనిపెట్టి నిరోధించ వచ్చు. ఒక ప్రాంతంలోని ముఖ్య పంటల్లో ఉన్న చీడపీడల చారిత్రక సమాచారం నమోదు ద్వారా రాబోయే రోజుల్లో పంటల సంరక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. చీడపీడలు, తెగుళ్ల సమాచారం అందుబాటులో ఉంచడం ద్వారా విధానకర్తలు వ్యవసాయ రంగానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
సూచనలు పొందడానికి..
- గోపికాంత్, వాంకిడి వ్యవసాయాధికారి
చీడపీడల నివారణకు, సత్వర సలహాలు, సూచన లు పొందడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఎన్పీఎస్ఎస్ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చించి. . అనేక పంటల లో కీలకమైప పురుగులు, తెగుళ్ల ఉదృతి సమాచారాన్ని ఈ యాప్లో నమోదు చేయవచ్చు. రైతు నేరుగా మొబైల్ ద్వారా పురుగు లేదా తెగుళ్లు చిత్రాన్ని తీసి యాప్లో అప్లోడ్ చేస్తే వెంటనే గుర్తించి దాని లక్షణాలు, చేపట్టాల్సిన సస్యర క్షణ చర్యల సమాచారాన్ని అందజేస్తుంది. రైతులు పండించే పంటల దిగుబడులు పెంచేందుకు అను కూలమైన ఈ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.