Share News

‘బండ’ బాదుడు

ABN , Publish Date - Jun 11 , 2026 | 10:58 PM

సామాన్యుడి వంట గదిలో మరోమారు ‘గ్యాస్‌’ మంటలు రేగాయి. నిత్యం పెరుగుతున్న ధరలతో ఇప్పటికే సతమతం అవుతున్న పేద, మద్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వడ్డన వదిలింది. గృహావసరాలకు వినియోగించే(డొమెస్టిక్‌) గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.29పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించడంతో వినియోగదారులు ఒక్కసారిగా బిత్తరపోతున్నారు.

 ‘బండ’ బాదుడు
లోగో

బెజ్జూరు, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): సామాన్యుడి వంట గదిలో మరోమారు ‘గ్యాస్‌’ మంటలు రేగాయి. నిత్యం పెరుగుతున్న ధరలతో ఇప్పటికే సతమతం అవుతున్న పేద, మద్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వడ్డన వదిలింది. గృహావసరాలకు వినియోగించే(డొమెస్టిక్‌) గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.29పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించడంతో వినియోగదారులు ఒక్కసారిగా బిత్తరపోతున్నారు. కాగా మూడు నెలల క్రితం మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఏకంగా రూ.60మేర పెంచి షాక్‌ ఇచ్చింది. ఆ భారం నుంచి కోలుకోకముందే ఇప్పుడు మరోమారు రూ.29పెంచింది. తాజా పెంపుతో జిల్లాలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రికార్డు స్థాయిలో రూ.1013నుంచి ప్రాంతాలను బట్టి రూ.1021వరకు ఉంది. సిలిండర్‌ ధర రూ,వ ేయి దాటడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.

- జిల్లా ప్రజలపై భారం..

గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు ప్రభావం జిల్లాపై తీవ్రంగా పడనుంది. జిల్లాలో హెచ్‌పీ, భారత్‌, ఇండియన్‌ గ్యాస్‌ కంపెనీలకు చెందిన సిలిండర్లను ప్రజలు వినియోగిస్తున్నారు. జిల్లాలో మొత్తం 12గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం గ్యాస్‌ కనెక్షన్లు 1.90లక్షలు, దీపం కనెక్షన్లు 10,591, ఉజ్వల కనెక్షన్లు 26,481ఉన్నాయి. పెరిగిన ఽరూ.29 ధరలతో పోల్చి చూస్తే జిల్లాలో వినియోగదారులపై రూ.27లక్షలకు పైగా అదనపు భారం పడుతోందని వాపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, ఇప్పుడు గ్యాస్‌ ధరలు పెరగడంతో నెలవారి బడ్జెట్‌ తలకిందులవుతుందని సామాన్య ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కాగా గ్యాస్‌ బుక్‌ చేసుకుంటే ఏజెన్సీ వారు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉచితంగా సిలిండర్‌ను ఇంటికి చేర్చాలన్న నిబంధన ఉంది. కానీ జిల్లాలో ఎక్కడ కూడా ఇది అమలు కావడం లేదు. అధికారులు సైతం దీన్ని పెద్దగా పట్టించుకో వడం లేదని చెబుతున్నారు.

పేదలకు భారం..

- అలగం సుప్రియ, గృహిణి

గ్యాస్‌ సిలిండర్‌ ధర నెలలో రెండుసార్లు పెంచడంతో పేద ప్రజలకు భారంగా మారింది. దీంతో గ్యాస్‌ కొనలేని పరిస్థితి నెలకొంది. ఇలా ధరలు పెరుగుతూ పోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏం కావాలి. పేదల ప్రభుత్వమని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ ఇలా సామా న్యులను ఇబ్బంది పెట్టేలా ఇష్టాను సారంగా ధరలు పెంచుకుంటు వెళ్లడం సరికాదు. పెరిగిన ధరలను ప్రభుత్వం తక్షణమే నియంత్రించాలి.

Updated Date - Jun 11 , 2026 | 10:58 PM