Share News

అరకొరగా ‘మద్దతు’

ABN , Publish Date - May 21 , 2026 | 01:48 AM

కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వానాకాలం సాగుకు ముందు కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్‌ ప్రైజ్‌) ప్రకటిస్తుంది. తాజాగా 2026-2027 సం వత్సరానికి సంబంధించి ప్రకటించిన కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) పెంపుపై రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు పెదవి విరుస్తున్నాయి. ప్రధానంగా సాగు చేసే పంటలకు పెట్టుబడులు

అరకొరగా ‘మద్దతు’

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వానాకాలం సాగుకు ముందు కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్‌ ప్రైజ్‌) ప్రకటిస్తుంది. తాజాగా 2026-2027 సం వత్సరానికి సంబంధించి ప్రకటించిన కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) పెంపుపై రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు పెదవి విరుస్తున్నాయి. ప్రధానంగా సాగు చేసే పంటలకు పెట్టుబడులు వేలల్లో పెరుగుతుంటే ప్రభుత్వం మద్దతు ధర పదులు, వందల సంఖ్యలోనే ఎంఎస్పీ నామమాత్రంగానే ఉంటోందని రైతులు వాపోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం సాగు (ఖరీఫ్‌)లో వరి, పత్తి ప్రధానంగా సాగు చేస్తారు. యాసంగిలో వరి సాగు మాత్రమే ప్రధానం గా ఉంటుంది. వానకాలం సీజన్‌లో వరి 1.91 లక్షల ఎకరాలు, యాసంగిలో 1.81 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలో వరికి మద్దతు ధర కేవలం రూ 72 మాత్రమే పెంచింది. ప్రస్తుతం కామన్‌ రకం వరి పంటకు రూ 2369 మద్దతు ధర ఉండగా రూ 2441 చేరింది. సాగు ఖర్చులతో పోలిస్తే నిరాశజనకంగానే ఉందని రైతులు వాపోతున్నారు. గ్రేడ్‌ - ఏ రూ 2461 ఖరారు చేశారు. జిల్లాలో రెండో ప్రధాన పంటగా వానాకాలంలో పత్తి 47,120 ఎకరాలు సాగు చేస్తారు. పత్తికి మద్దతు ధర రూ.557 పెంచారు. పెరిగిన ప్రకారం గత సంవత్సరం మద్దతు ధర పత్తికి క్వింటాలకు రూ.8110 ఉండగా, ఈసారి పొడుగుపింజ రకానికి రూ.8667, చిన్న, మధ్య స్థ పింజ పత్తికి రూ 8267 ధర నిర్ణయించారు.

మొక్కజొన్న, పెసరకు అంతంతే..

జిల్లాలో మొక్కజొన్న, పెసర పంటకు అంతంత మాత్రంగానే మద్దతు ధర ప్రకటించడం రైతుల్లో అసం తృప్తి వ్యక్తం అవుతోంది. వానాకాలం సీజన్‌లో మొక్కజోన్న 2650 ఎకరాలు, యాసంగి సీజన్లో 4308 ఎకరాల్లో సాగు చేస్తా రు. కేంద్ర ప్రభుత్వం మొక్క జొన్నకు రూ 10 మాత్రమే పెం చింది. దీని ప్రకారం మొక్క జొన్న గత సంవత్సరం మద్దతు ధర రూ 2400 ఉంటే ఈసారి రూ2410 చేరింది. పెసర సాగు ఖరీఫ్‌లో 65 ఎకరాల వరకు సాగు చేస్తారు. పెసరకు రూ 12 మాత్రమే ప్రక టించిన మద్దతు ధరతో క్వింటాలకు రూ 8780 చేరిం ది. దీంతోపాటు కంది పంటకు రూ 450, వేరుశనగ రూ 254, జొన్నలు రూ 324 మినుములు రూ400, రాగులు రూ 319, నువ్వు లు రూ 500 మద్దతు ధర పెరిగింది. కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలో పొద్దు తిరు గుడు సాగుకు ఆశాజనకంగా ఉంది. జిల్లాలో యా సంగిలో 1400 ఎకరాల వరకు పొద్దుతిరుగుడు సాగు చేస్తారు. ప్రస్తుతం క్వింటాలుకు రూ 7721 ఉండగా మద్దతు ధర రూ 622తో రూ 8343 చేరింది.

ఏటా పెరుగుతున్న సాగు పెట్టుబడులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖరీఫ్‌లో 2.48 లక్షల ఎకరాలు, యాసంగిలో 1.89 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు చేస్తున్నారు. ప్రతి ఏటా సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. పెట్టిన పెట్టుబడికి వచ్చే రాబ డికీ పొంతన లేకుండా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు. ఎరువులు. పురుగు ల మందులు. కూలీల రేట్లు, వ్యవసాయ యంత్రా ల అద్దెలు పెరుగుతున్నాయి. సాధారణంగా వరి సాగుకు రూ 30వేలు. పత్తి సాగుకు రూ 40 వేల వరకు ఖర్చు అవుతుందని రైతులు చెప్తున్నారు. మరోవైపు అకాల వర్షాలు, వడగళ్లతో నష్టాల ను చవిచూడాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. కనీస మద్దతు ధర పెంచాలని కోరుతున్నారు.

జిల్లాలో ఖరీఫ్‌ సాగు 2.48 లక్షల ఎకరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలంలో 2 లక్షల 48 వేల 507 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. ఇందులో వరి లక్షా 91 వేల 366 ఎకరాలు, పత్తి 47,120 ఎకరాలు, పెసర 65 ఎకరాలు, కందులు 853 ఎకరాలు, జొన్నలు 14, మొక్కజొన్న 3,430 ఎకరాలు, ఇతర పంటలు 5,593 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు వేశారు. ఇందుకోసం వరి 56,789 క్వింటాళ్ల విత్తనాలు, అవసరం అవుతాయని అంచనాలు వేయగా కందులు 120.6 క్వింటాళ్లు, మొక్కజొన్న 59.84 క్వింటాళ్లు, పత్తి 1,23,790 ప్యాకెట్లు, పెసర్లు 4.18 క్వింటాళ్లు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. వానాకాలం సాగుకు సంబంధించి 2.48 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా, ఎరువులు 57,399 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. యూరియా 25,944మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 3,760 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 22,710మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 4,225 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ760 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు.

Updated Date - May 21 , 2026 | 01:48 AM