Share News

kumaram bheem asifabad-అన్నదాతకు స్వల్ప ఊరట

ABN , Publish Date - May 14 , 2026 | 10:44 PM

వానాకాలం సీజన్‌ నుంచి పలు రకాల పంటలకు మద్ద తు ధర (ఎంఎస్‌పీ) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు వ్యవసా యశాఖ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. పెరిగిన పెట్టుబడులు ఇతర ఖర్చులతో పోల్చితే మరింత ధరలు పెంచితే రైతులకు లాభం చేకూరే దని పలువురు చెబుతున్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఏటా రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు పెంచుతు న్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

kumaram bheem asifabad-అన్నదాతకు స్వల్ప ఊరట
లోగో

- పత్తికి రూ. 557, వరికి రూ. 72, మొక్కజొ న్నకు రూ. 10 మాత్రమే పెంపు

- కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన

- జిల్లాలో 4.5 లక్షల ఎకరాల్లో పంటల సాగు

చింతలమానేపల్లి, మే 14 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌ నుంచి పలు రకాల పంటలకు మద్ద తు ధర (ఎంఎస్‌పీ) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు వ్యవసా యశాఖ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. పెరిగిన పెట్టుబడులు ఇతర ఖర్చులతో పోల్చితే మరింత ధరలు పెంచితే రైతులకు లాభం చేకూరే దని పలువురు చెబుతున్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఏటా రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు పెంచుతు న్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవ నాలు రాగానే వానాకాలం పంటల సాగు పెరుగు తుందన్న అంచనాతో మద్దతు ధరలపై దృష్టి పెట్టి న కేంద్ర వ్యవసాయశాఖ ఎంఎస్‌పీ (మినిమమ్‌ సపోర్ట్‌ ప్రైజ్‌) పెంపునకు ఆమోద ముద్ర వేసింది.

- ఏటా పెరుగుతున్న ఖర్చులు..

పంటల సాగుకు ఏటా ఖర్చులు పెరుగుతున్నా యని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 4.5 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. దుక్కి దున్నింది మొదలు, నాట్లు వేయడం, కలుపు పనులు, ట్రాక్టర్‌ కిరాయి, కూలీలు, విత్తనాలు, ఎరువుల ధరలు ప్రస్తుతం ఆకాశన్నంటుతున్నాయి. ఎకరానికి సగటున రూ. 30 నుంచి40 వేల వరకు ఖర్చు అవుతున్నదని రైతులు చెబుతున్నారు. ప్రభు త్వం పెంచిన ధరలు మరింత పెంచితే బాగుండే దన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎకరం పత్తి సాగు చేస్తే 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాల్‌కు ధర రూ. గతంలో 8,110 ఉంటే ఈ ఏడాది రూ. 557 పెంచి రూ. 8,667 చేరింది. దీంతో ఎఝరాకు దిగుబడి 7 కింటాళ్లు అనుకుంటే రూ. 60,669 వస్తుంది. ఖర్చులు 40వేల వరకు పోతే కేవలం 20 వేలే మాత్రమే మిగులుతోంది. అది వాతావరణ పరిస్థితులు అన్ని తట్టుకొని అనుకున్న విధంగా దిగుబడులు వస్తే ..మిగిలిన వరి, సోయా, కందులు ఇలా అన్ని రకాల పంటల పరిస్ధితులు ఇలాగే ఉన్నాయి.

కనీస మద్దతు ధర క్వింటాల్‌కు ఇలా..

పంట 2025-26 2026-27 పెంపు

వరి(సాధారణ) 2,369 2,441 72

వరి (గ్రేడ్‌-ఏ) 2,389 2,461 72

జొన్న (హైబ్రిడ్‌) 3,699 4,023 324

జొన్న (మల్దండి) 3,839 4073 324

సజ్జలు 2,775 2,900 125

రాగులు 4,886 5,205 319

మొక్కజొన్న 2,400 2,410 10

కందులు 8,000 8,450 12

మినుములు 7,800 8,200 400

వేరుశనగ 7,263 7,517 254

పొద్దుతిరుగుడు 7,721 8,343 622

సోయాబీన్‌ (పచ్చ) 5,328 5,708 380

నువ్వులు 9,846 10,346 500

అవిసెలు 9,537 10,052 515

పత్తి (మధ్యస్థ పింజ 7,710 8,267 557

పత్తి పొడుగు పింజ 8,110 8,667 557

రైతు సంక్షేమానికి కేంద్రం కృషి..

- ధోని శ్రీశైౖలం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

పంటల ధరలను పెంచి కేంద్రం రైతుల సంక్షే మం కోసం కృషి చేస్తుంది. పత్తి పంట క్విటాల్‌కు రూ. 8,667 మద్దతు ధర పెరిగింది. పత్తి పంటతో పాటు ఇతర పంటల మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జిల్లా రైతాంగానికి మేలు జరుగనుంది.

Updated Date - May 14 , 2026 | 10:45 PM