Share News

kumaram bheem asifabad- పత్తికి ఊపిరి

ABN , Publish Date - Jul 23 , 2026 | 10:18 PM

చాలా రోజుల నిరీక్షణ తర్వాత జిల్లాలో కురుస్తున్న వర్షాలు పత్తి రైతులకు ఊరటనిస్తున్నాయి. తొలకరి ఆధారంగా పత్తి విత్తనాలు వేసినా.. ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళనలో పడిపోయారు. అధిక ఉష్ణోగ్రతలకు వాడిపోయి నేల వాలిన పత్తి మొక్కలకు జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాణం పోసి నట్లయింది.

kumaram bheem asifabad- పత్తికి ఊపిరి
లోగో

- తేరుకున్న మొక్కలు

- రైతుల్లో చిగురించిన ఆశలు

- జిల్లాలో 3.7 లక్షల ఎకరాల్లో సాగు

ఆసిఫాబాద్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): చాలా రోజుల నిరీక్షణ తర్వాత జిల్లాలో కురుస్తున్న వర్షాలు పత్తి రైతులకు ఊరటనిస్తున్నాయి. తొలకరి ఆధారంగా పత్తి విత్తనాలు వేసినా.. ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళనలో పడిపోయారు. అధిక ఉష్ణోగ్రతలకు వాడిపోయి నేల వాలిన పత్తి మొక్కలకు జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాణం పోసి నట్లయింది. నేల వాలిన పత్తి మెక్కలు వర్షపు చినుకులకు నిగనిగలాడు తున్నాయి. ఇంతకాలం వానలకోసం వేచిచూసిన రైతులు సాగు చేసే సమయం దాటిపోతుందని వరుణుడి పై భారం వేసి జూన్‌ మొదటి వారంలోనే విత్తనాలను విత్తారు. విత్తనాలు విత్తిన తర్వాత ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురువలేదు. దీనికి తోడు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. విత్తిన విత్తనాలు మాడిపోవడంతో కోన్ని చోట్ల రైతులు రెండో సారి పత్తి విత్తనాలను పెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. అప్పుడప్పుడు వర్షాలు కురిసినా పంటలకు పెద్దగా లాభం జరగలేదు. దీంతో రైతులు ఆందోళన చెందారు. వర్షాల కోసం గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలకు ప్రాణం పోసినట్లయింది. కురుస్తున్న వర్షాలతో రైతుల ముఖాల్లో ఆనందం వ్యక్తమవుతుంది.

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో గడిచిన రెం డు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు పం టల పాలిట వరంగా మారింది.జూన్‌ 1నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 432.0 మిల్లీమీ టర్లు నమోదు కావాల్సి ఉంది. కానీ 353.0 మిల్లీమీ టర్ల వర్షపాతం నమోదు అయింది. మండ లాల వారీ గా పరిశీలిస్తే జైనూరు, సిర్పూర్‌(యు), లింగాపూర్‌, కెరమెరి, రెబ్బెన, తిర్యాణి, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టి), కౌటాల, మండలాలలో సాధారణ వర్షపాతం నమోదు కాగా కాగజ్‌నగర్‌, వాంకిడి, చింతలమానేపల్లి, బెజ్జూర్‌, పెంచికల్‌పేట, దహెగాం లో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదు అయింది.

- వానాకాలం సీజన్‌లో..

జిల్లాలోని 15 మండలాలలో ఈ వానకాలం సీజన్‌ లో 4,52,202 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవు తాయని అధకారులు అంచనాలు వేశారు .అయితే వీటిలో పత్తి 3,70,919 ఎకరాలు, వరి పంట 42,228 ఎకరాలు, కంది పంట 20,817, సోయాబీన్‌ పంట 1,326 ఎకరాలు, మొక్కజొన్న 668 ఎకరాల్లో అలాగే ఇతర పంటలైన జొన్న, పెసర ,మినుములు, ,మిరప, వేరుశెనగ, ఆముదాలు, నువ్వు లు 11,254 ఎకరాలలో సాగవుతున్నట్లు అంచనాలు రూపొందించారు.

పత్తికి ప్రయోజనం..

-పుల్గం పోచన్న, రైతు, ఆసిఫాబాద్‌

రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో సంతో షంగా ఉంది. పంటలు పూర్తిగా ఎండి పోయే దశకు చేరుకున్నాయి. ఈ వర్షాలతో పంటలకు ఎం తో మేలు జరిగింది. చేలల్లో పత్తి మొక్కలు మొల కెత్తాయి. కానీ ఈ వర్షం సరిపోదు. ఇంకా భారీ వర్షా లు రాకపోతే సీజన్‌లో రైతులకు నష్టమే జరుగు తుంది.

Updated Date - Jul 23 , 2026 | 10:29 PM