Share News

kumaram bheem asifabad- నిలువ నీడ కరువు

ABN , Publish Date - Oct 18 , 2026 | 10:12 PM

జిల్లాలోని పలు మండలాల్లో బస్‌షెల్లర్టు లేక ప్రయాణికులు కూర్చోలేక, నిల్చోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్సులకోసం చెట్ల నీడలో, హోటళ్ల ఎదుట, రోడ్డు పై వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రయాణికు ల సౌకర్యార్థం తాగునీరు, మూత్రశాలలు ఎక్కడా కనిపిం చడం లేదు. దీంతో విద్యార్థినులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం కనీసం చేతి పంపులు సైతం ఎక్కడా లేవు.

kumaram bheem asifabad- నిలువ నీడ కరువు
సిర్పూర్‌(టి)లో రోడ్డుపై నిలిపిన బస్సు

- పట్టించుకోని పాలకులు, అధికారులు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని పలు మండలాల్లో బస్‌షెల్లర్టు లేక ప్రయాణికులు కూర్చోలేక, నిల్చోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్సులకోసం చెట్ల నీడలో, హోటళ్ల ఎదుట, రోడ్డు పై వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రయాణికు ల సౌకర్యార్థం తాగునీరు, మూత్రశాలలు ఎక్కడా కనిపిం చడం లేదు. దీంతో విద్యార్థినులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం కనీసం చేతి పంపులు సైతం ఎక్కడా లేవు. నిత్యం వివిధ పనులపై ప్రజలు ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. దీని కోసం బస్టాండుకుని చెరుకుని బస్సులు వచ్చే వరకు వేచి చూస్తారు. ఏదైనా కారణంతో బస్సులు ఆలస్యం అయినా వేచి ఉండేందుకు బస్టాండ్‌లు ఉండాలి. జిల్లాలో మూడు నాలుగు మండలాల్లో తప్ప ఆర్టీసీ బస్టాండ్‌లు ఎక్కడాలేవు. కొన్ని మండలాల్లో చెట్లు, కిరాణ షాపులు, దుకాణాలు, హోటళ్లు, రోడ్లపైనే వేచిచూడాల్సిన దయనీయ పరిస్థితి ఉంది. ఎండకాలం ఎండల తీవ్రత అధికం కావడంతో ప్ర యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు మూత్ర శాలలు, మరుగుదొడ్లు సైతం లేక పోవడంతో ఒకటికి రెంటికి ఉపిరి బిగపట్టి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది.

- 15 మండలాల పరిధిలో..

జిల్లాలోని 15 మండలాల్లో 2001 జనాభా లెక్కల ప్రకారం 5.15 లక్షల జనాభా ఉంది. జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, కౌటాల, వాంకిడిలలో బస్టాండులు ఉన్నాయి. తిర్యాణి, పెంచికలపేటలలో బస్‌షెల్టర్‌లు తప్ప మరెక్కడా ప్రయాణికులు నిలచునేందుకు నిలువ నీడ లేదు. దీంట్లో వాంకిడి బస్టాండ్‌ నిరుపయోగంగా ఉంది.. కెరమెరి, సిర్పూర్‌(యూ), జైనూర్‌, దహెగాం, సిర్పూర్‌(టి), బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాల్లో బస్టాండ్‌లు లేక పోవడంతో వేసవి కాలంలో వేడిమి, వర్షాకాలంలో వర్షానికి, శీతకాలంలో చలికి ప్రయాణికులు తట్టుకోలేక పోతున్నారు. అందుబాటులో మంచినీటి సౌకర్యం, మూత్రశాలలు, మరుగుదొడ్ల వసతి కల్పించక పోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

- జిల్లాలో ఇది పరిస్థితి..

వాంకిడి మండల కేంద్రంలో బస్టాండ్‌ ఉన్నప్పటికీ అది కొంత కాలంగా నిరుపయోగంగానే ఉంది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చి వేరే ప్రాంతానికి వెళ్లే వారు దుకాణాల దగ్గర, హోటళ్ల వద్ద వేచి చూడాల్సింది. ఈ సమయంలో మూత్రం వచ్చిన బహిర్భూమికి వెళ్లాలన్న ఇబ్బంది. జైనూర్‌ మండలంలో 31 వేల వరకు జనాభా ఉంది. ఇక్కడ అధిక శాతం గిరిజనులే. వీరు వివిధ గ్రామాల నుంచి పనుల నిమిత్తం మండల కేంద్రానికి ప్రతి రోజు వస్తుంటారు. బస్సులు ఆలస్యం కావడం వేచి చూసేందుకు బస్టాండ్‌ లేక పోవడంతో రోడ్డు పక్కన దుకాణాల వద్ద నిలబడి వేచి చూడాల్సిందే. దీనికి తోడు తాగునీటి వసతి, మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. అధిక శాతం గిరిజనులు ఉండే ఈ ప్రాంతంలో బస్టాండ్‌ ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. బెజ్జూరు, సిర్పూర్‌(టి), చింతలమానేపల్లి, దహెగాం, కెరమెరి మండలాల్లోనూ బస్టాండ్‌ లేక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి పరిస్థితులను బట్టి దుకాణాల వద్ద, చెట్ల నీడన, హోటళ్ల వద్ద బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మంచినీటి వసతి లేక పోవడంతో వివిధ పనులపై మండల కేంద్రాలకు వచ్చే మహిళలు, చిన్న పిల్లలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అంతే కాక మూత్ర శాలలు, మరుగుదొడ్లు లేక పోవడంతో ప్రయాణికుల బాధలు రెట్టింపు అవుతున్నాయి. ఇకనైనా అధికారులు ప్రతి మండల కేంద్రంలో తాగునీటి, మూత్రశాలలు, మరుగుదొడ్ల వసతులతో కూడి బస్టాండ్‌ల నిర్మాణం చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

బస్‌షెల్టర్‌లు లేక ఇబ్బందులు..

- చిరంజీవి, సీపీఐ జిల్లా నాయకుడు

జిల్లాలో బస్‌స్టేజీల వద్ద బస్‌ షెల్టర్‌లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలంలో, ఎండాకాలంలో చెట్ల నీడ కింద బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తుంది. బస్‌స్టేజీల వద్ద మంచినీటి వసతి లేదు. దీంతో ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాంకిడిలో బస్టాండ్‌ నిర్మించినప్పటికీ నిరుపయోగంగానే ఉంది. ఆర్‌టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.

Updated Date - Oct 18 , 2026 | 10:12 PM