ప్రతీ రైతుకు చేదోడు
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:23 PM
తాడూరు, చారకొండ, పెద్దకొత్తపల్లి మండలాల్లో సింగిల్‌విండో కార్యాల యంలో సర్వసభ్య సమావేశాలు జరిగాయి.
- తాడూరు సింగిల్ విండో చైర్మన్ రామచంద్రారెడ్డి
- చారకొండ, పెద్దకొత్తపల్లి మండలాల్లోనూ సమావేశాలు
తాడూరు/ చారకొండ/ పెద్దకొత్తపల్లి, సెప్టెం బరు 30 (ఆంధ్రజ్యోతి) : తాడూరు, చారకొండ, పెద్దకొత్తపల్లి మండలాల్లో సింగిల్‌విండో కార్యాల యంలో సర్వసభ్య సమావేశాలు జరిగాయి. తా డూరులో సింగిల్ విండో చైర్మన్ రామచంద్రా రెడ్డి, చారకొండలో సింగిల్‌విండో చైర్మన్ జెల్ల గు రువయ్యగౌడ్, పెద్దకొత్తపల్లి మండలం కొత్తపేట సింగిల్‌విండో కార్యాలయంలో సింగిల్ విండో చై ర్మన్ కట్ట రాజేందర్‌గౌడ్‌ల అధ్యక్షతన సమావేశా లు నిర్వహించారు.
తాడూరు సింగిల్‌విండో కార్యాలయంలో 702 మంది రైతులకు గాను రూ. 5కోట్ల 68 లక్షల 34 వేలు రైతులకు రుణాల ద్వారా అందించినట్లు చైర్మన్ రామచంద్రారెడ్డి తెలిపారు. రైతులకు తమ వంతుగా రుణాలను అందజేసి చేదోడు వాదోడుగా నిలుస్తున్నామని అ న్నారు. చిరు వ్యాపారులకు సై తం 9మందికిగాను 19లక్షల రూ పాయలు అందజేసి వారి ఆర్థికా భివృద్ధికి కృషి చేస్తున్నామని తెలి పారు. యా సంగి, వానాకాలాల్లో వరి, మొక్క జొన్న ప్రభుత్వ మద్ద తు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ల బ్ధిదారులు సకాలంలో తమరు ణాలకు సంబం ఽధించిన రెన్యువల్‌ను వెంటనే పూర్తి చేసుకోవా లని సూచించారు. కార్యక్రమంలో విండో వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, సర్పంచ్ మల్లయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటయ్యతో పాటుసింగిల్‌విం డో డైరెక్టర్లు, సీఈవో శివ, రైతులు పాల్గొన్నారు.
చారకొండలో చైర్మన్ జెల్ల గురువయ్యగౌడ్ మాట్లాడుతూ ప్రస్థుత ఎల్‌నినో పరిస్థితుల నేప థ్యంలో రైతంగాం తీవ్రంగా నష్టపోయె ప్రమా దం ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిం చి ప్రత్యేక ప్యాకేజీతో ఆదుకోవాలని కోరారు. వా ర్షిక ఆదాయవ్యయాల నివేదికను సభ్యుల ముం దు ఉంచి ఏకగ్రీవంగా అమోదించి పలు అం శాలపై తీర్మానం చేశారు. రైతులు రూ. 2 వేలు చెల్లించి ఎఫ్‌పీవోలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. సీఈవో వెంకటయ్య, ఉప సర్పంచ్ కీసరి మల్లేష్, డైరెక్టర్లు నిర్మల్‌రావు, కొండల్‌గౌడ్, రైతులు పాల్గొన్నారు.
పెద్దకొత్తపల్లిలో సింగిల్ విండో చైర్మన్ కట్ట రాజేందర్‌గౌడ్ మాట్లాడుతూ సింగిల్ విండో ద్వారా ప్రతీ రైతుకు మెరుగైన సేవలందజేసేం దుకు కృషి చేస్తున్నామని అన్నారు. సమావేశం లో సింగిల్ విండో వైస్ చైర్మన్ రాములు యాదవ్, సీఈవో పాండు, డైరెక్టర్లు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.