kumaram bheem asifabad- చేయూత.. వడపోత
ABN , Publish Date - Oct 07 , 2026 | 10:37 PM
దసరా పండుగ వరకు చేయూత పింఛన్లు అందిం చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇటీవల అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇటీవలే సర్వే పూర్తికా గా ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. నిరుపేదలు, అర్హులకు ఫించన్లు అందించాలని ఉద్దేశంతో అధికారులు 360 డిగ్రీల్లో సమగ్ర సర్వే చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక మొబైల్ యాప్‌తో దరఖా స్తులు చేసుకున్న వారి వివరాలు తెలుసుకుంటు న్నారు.
- అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌తో సర్వే
- అనర్హుల ఏరివేతకు అధికారుల చర్యలు
ఆసిఫాబాద్‌రూరల్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ వరకు చేయూత పింఛన్లు అందిం చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇటీవల అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇటీవలే సర్వే పూర్తికా గా ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. నిరుపేదలు, అర్హులకు ఫించన్లు అందించాలని ఉద్దేశంతో అధికారులు 360 డిగ్రీల్లో సమగ్ర సర్వే చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక మొబైల్ యాప్‌తో దరఖా స్తులు చేసుకున్న వారి వివరాలు తెలుసుకుంటు న్నారు. గతనెల 30 వరకు సర్వే నిర్వహించిన అధి కారులు ప్రక్రియను మరింత పకడ్బందీగా ముం దుకు తీసుకువెళ్తున్నారు. లబ్ధిదారుల వివరాలు క్రోడికరించి అర్హులను ఎంపిక చేసి జాబితాను ఉన్న తాధికారులకు పంపనున్నారు.
- జిల్లాలో ఇది పరిస్థితి..
జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, 15 మండలా ల్లో మొత్తం 9,466 దరఖాస్తులు రాగా అధికారులు 9458 దరఖాస్తులను ట్యాగ్ చేశారు. ఇందులో 8313 మందిని అర్హులుగా గుర్తించగా 676 మందిని అన ర్హులుగా గుర్తించారు. అలాగే 406 దరఖాస్తులను అన్‌హోల్డ్‌లో పెట్టగా 63 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. కాగా అనర్హుల ఏరివేతకు అదికారులు అత్యాదునిక సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారు. దరఖాస్తుదారులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా వారికి ఏమైనా భూములున్నాయా..? వాహనాలున్నాయా..? ఇతరత్రా ఆస్తులు ఉన్నాయా అనేది పరిశీలిస్తున్నారు. ఈ యాప్ ద్వారా భూములు, వాహనాలకు ఆధార్‌కార్డు లింక్ ఉంటే వెంటనే తెలిసిపోతాయి. దీంతో వారిని అనర్హులుగా గుర్తించనున్నారు. కొన్ని దశల్లో అర్హులు కూడా అనర్హులయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉదాహరణకు ఎవరికైనా బైక్ ఉండి దానిని విక్రయించిన తర్వాత ధ్రువీకరణ పత్రాలు మార్చుకోకపోతే యాప్‌లో సదరు వ్యక్తికి బైక్ ఉన్నట్లే చూపిస్తుంది.
- గతంలో భూములు ఉన్నా..
గతంలో భూములు ఉండి అమ్ముకున్నా రిజిస్ట్రేష న్ కానివారు పింఛన్‌కు అర్హత కోల్పోయే అవకాశం ఉంది. దరఖాస్తుదారుల ఆర్థిక స్థితిగతులను కచ్చితంగా అంచనా వేసేందుకు ఈ 360డిగ్రీల యాప్‌ను ఉపయోగిస్తున్నారు. కుటుంబ నేపథ్యం, డిపాజిట్ వివరాలు, దరఖాస్తుదారుల పేరిటకార్లు, వాణిజ్య వాహనాలు, వార్షిక ఆదాయం, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణాల్లో రూ. 2 లక్షలకు పరిమితికి మించినట్లయితే క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పింఛన్లు దసరా పండుగకు కానుకగా ఇవ్వాలని నిర్ణయించ డంతో అధికారులు అర్ముల ఎంపిక ప్రక్రియ ప్రారం భించారు. మొదట ఈ యాప్ ద్వారా అన్నింటిని పరిశీలించి ఏవైనా తప్పులుంటే సవరిస్తారని అధి కారులు చెబుతున్నారు. పైరవీలకు తావు లేకుండా కేవలం అసలైన నిరుపేద లకే పింఛన్ అందించాల పకడ్బందీగా సర్వే చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అర్హుల ఎంపిక ప్రారంభమైంది..
-దత్తారావు, డీఆర్‌డీవో
సర్వే పూర్తికావడంతో అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా అర్హులైన వారి ని గుర్తించి జాబితా రూపొందిస్తాం. మండల, మున్సి పల్ స్థాయిలో అధికారులు పరిశీలించి అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. ప్రభుత్వ సూచనల మేరకు అర్హులకు పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటాం.