Share News

పండుగ సాయన్నకు ఘన నివాళి

ABN , Publish Date - Aug 08 , 2026 | 11:28 PM

జిల్లా కేంద్రంలో పండుగ సాయన్న జయంతిని శనివారం ఘనంగా నిర్వహిం చారు.

పండుగ సాయన్నకు ఘన నివాళి
నాగర్‌కర్నూల్‌లో పండుగ సాయన్న చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న నాయకులు

నాగర్‌కర్నూల్‌టౌన్‌, ఆగస్టు8 (ఆంధ్రజ్యో తి) : జిల్లా కేంద్రంలో పండుగ సాయన్న జయంతిని శనివారం ఘనంగా నిర్వహిం చారు. పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వ ద్ద ఏర్పాటు చేసిన పండుగ సాయన్న చి త్ర పటానికి ఫూలే, అంబేడ్కర్‌ యువజ న సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిలకర బాలస్వా మి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. ఆయన మాట్లాడుతూ అణగారిన నిరుపేద వర్గాల అభ్యున్నతి, ప్రజల ఆత్మ గౌరవం, స్వేచ్ఛ కోసం పండుగ సాయన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. తె లంగాణ ప్రభుత్వం పండుగ సాయన్న జ యంతిని అధికారికంగా నిర్వహించాలని కోరా రు. కార్యక్రమంలో ఆదివాసి పార్టీ జిల్లా అధ్యక్షు డు ఎన్‌.సత్యం, ఫూలే, అంబేడ్కర్‌ యువజన సంఘం నాయకులు వడ్డె శేఖర్‌, పర్వతాలు, మదన్‌, యాదగిరి, రవితేజ పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2026 | 11:28 PM