Share News

kumaram bheem asifabad- ఇందిరాగాంధీకి ఘన నివాళి

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:18 PM

జిల్లాలోని వాంకిడి, రెబ్బెన, జైనూర్‌ మండలాల్లో ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం కాంగ్రెస్‌ నాయకులు ఆమె చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాంకిడి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు ఇందిరాగాంధీ చిత్రపటానికి ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇందిరాగాంధౠ ఆశయాల సాధనకు పాటుపడాలని కాంగ్రెస్‌ నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సామెల సర్పంచ్‌ సంతోష్‌, ఉపర్పంచ్‌ రేపాక నాగభూషనం, కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు గుర్నులే నారాయణ, నాయకులు మందోకర్‌ అనిల్‌, వాడై పాండురగ్‌, తదితరులు పాల్గొన్నారు

kumaram bheem asifabad-  ఇందిరాగాంధీకి ఘన నివాళి
జైనూర్‌లో ఇందిరాగాంధీ చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న నాయకులు

వాంకిడి/రెబ్బెన/జైనూర్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వాంకిడి, రెబ్బెన, జైనూర్‌ మండలాల్లో ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం కాంగ్రెస్‌ నాయకులు ఆమె చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాంకిడి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు ఇందిరాగాంధీ చిత్రపటానికి ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇందిరాగాంధౠ ఆశయాల సాధనకు పాటుపడాలని కాంగ్రెస్‌ నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సామెల సర్పంచ్‌ సంతోష్‌, ఉపర్పంచ్‌ రేపాక నాగభూషనం, కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు గుర్నులే నారాయణ, నాయకులు మందోకర్‌ అనిల్‌, వాడై పాండురగ్‌, తదితరులు పాల్గొన్నారు. రెబ్బెనమండల కేంద్రంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పలువురు నాయకులు పూల మాలలు వేశారు. కార్యక్రమంలో నాయకులు చిరంజీవి గౌడ్‌, సోమశేఖర్‌, దుర్గం దేవాజీ, అజ్మిర గోపాల్‌, ఎస్టీ సెల్‌ ప్రసిడెంట్‌ భార్గవ్‌ గౌడ్‌, వార్డు సభ్యులు దుర్గం అన్నాజీ టెంపులో తదితరులు పాల్గొన్నారు. జైనూర్‌ మండల కేంద్రంలో ఇందీరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్‌ ార్టీ మండల అధ్యక్షులడు ఆత్రం శంకర్‌, మండల నాయకులు ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడుగణపతిరావ్‌, సర్పంచులు లక్ష్మణ్‌రావ్‌, జానేరావ్‌, లక్ష్మీ బీర్షావ్‌, స్పందన భూపతి, ఎంసీ డైరెక్టర్‌ లచ్చన్న, మాజీ ఎంపీటీసీ వీణాబాయి, మాజీ ఎంపీపీ దౌలత్‌రావ్‌, పార్టీ ఉపాధ్యక్షులు మోతిరాం, నాయకులు దేవిదాస్‌, ఆత్రం నాగోరావ్‌, శ్రీనివాస్‌, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 11:18 PM