Share News

మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వమా పాలించేది...

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:58 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫల మైందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు.

మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వమా పాలించేది...
. మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌

రామకృష్ణాపూర్‌, ఫిబ్రవరి17(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫల మైందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన స మావేశంలో మాట్లాడుతూ క్యాతన్‌పల్లి మున్సిపల్‌ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి ఎదుటే తమ బీఆర్‌ ఎస్‌, సీపీఐ మహిళ వార్డు కౌన్సిలర్లను కౌన్సిలర్ల విషయంలో కాంగ్రెస్‌కు చెందిన వార్డు కౌన్సిలర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నప్పటికీ ఎంపీ, మంత్రి చూస్తూ ఉండిపో యారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిరేవంత్‌ రెడ్డి మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు మహిళలకు తీసుకొచ్చామని చెప్పడం పేప ర్లకే పరిమితమైందన్నారు. సజావుగా సాగించాల్సిన ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని పోలీసుల పహారాల మధ్య మంత్రి దగ్గర ఉండి తమ అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ విషయమై రాష్ట్ర మహిళా కమిషన్‌ ముందు ఫి ర్యాదు చేయనున్నట్లు తెలిపారు. గెలుపొందిన తమ పార్టీ మహిళ కౌన్సిలర్ల మానప్రాణాలకంటే క్యాతన్‌పల్లి పీఠం ముఖ్యం కాదన్నారు. దౌర్జాన్యాల మధ్య రాజ్యాంగాన్ని ఖూని చేస్తూ పాలన చేస్తున్న కాం గ్రెస్‌ ప్రభుత్వానికి మంత్రి వివేక్‌కు గుణపాఠం చెప్పడం ఖాయ మని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేణి శంకర్‌ మాట్లాడుతూ పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ చైర్మన్‌ వైస్‌ చైర్మన్‌ ప్రమా ణస్వీకారిన్న ఉద్దేశపూర్వకంగా మంత్రి ఆదేశాల మేరకు అధికారులు వాయిదా వేశారన్నారు. ఏఐటీయుసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీ తారామయ్య మాట్లాడుతూ నీచాతినీచంగా మహిళలపై దురుసుగా ప్రవర్తించినటువంటి కాంగ్రెస్‌ కౌన్సిలర్లకు తగిన గుణపాఠం చెప్ప డమే కాకుండా ఎంపీ, మంత్రి వ్యవహారశైలిపై జాతీయ మహి ళా కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇంచార్జీ రాజా రమేశ్‌, పట్టణ అధ్యక్షులు కంభగోని సుదర్శన్‌గౌడ్‌, టీబీజీకేఎస్‌ నాయకులు మేడిపల్లి సంపత్‌, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామడుగు లక్ష్మణ్‌, జిల్లా నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్‌, వార్డుకౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 11:58 PM