Share News

రైతులపై పట్టింపులేని ప్రభుత్వం

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:19 PM

ప్రభు త్వానికి రైతులపై ఏమాత్రం మాత్రం పట్టిం పులేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు రఘునాథ్‌ వెరబెల్లి మండిపడ్డారు.

రైతులపై పట్టింపులేని ప్రభుత్వం
లక్షెట్టిపేట విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రఘునాత్‌ వెరబెల్లి

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాత్‌ వెరబెల్లి

లక్షెట్టిపేట, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ప్రభు త్వానికి రైతులపై ఏమాత్రం మాత్రం పట్టిం పులేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు రఘునాథ్‌ వెరబెల్లి మండిపడ్డారు. లక్షె ట్టిపేట పట్టణంలోని ఐబీలో ఆదివారం ఏర్పా టు చేసిన విలేకరుల సమాశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మంచిర్యాల ఎమ్మెల్యే తో పాటు మన మాజీ ఎమ్మెల్యేకు రైతుల పట్ల చిత్తశుద్ధి శూన్యం అన్నారు. రైతులు పం ట సాగు నుంచి అమ్ముకునేంత వరకు అష్టక స్టాలు పడాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యే ప్రేం సాగర్‌రావు రైతులు పండించిన పంటను ఎ లా దోచుకోవాలో తెలుసు తప్ప వాళ్ల పంటలను కొనుగోలు చేసి ఎలా ఆదుకోవాలో తెలియదన్నారు. ఈరోజు వరకు సాగునీటినీ విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నందున ప్రభుత్వం దిగి వచ్చి కడెం నుండి నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వ డం పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు రైతుల దగ్గర దోచుకోవాలని చూడటమే కానీ రైతులను ఆదుకోవాలని చూ సే వ్యక్తి కాదన్నారు. రైతులు కూడా 20శాతం కమీషన్‌ ఇస్తే నీరు ఇస్తారు కావచ్చు అని ఎ ద్దేవా చేసారు. మాజీ ఎమ్మెల్యే సైతం అంతకు తగ్గ బొంత అని నాలుగు పర్యాయాలు ఎమ్మె ల్యేగా చేసిన దివాకర్‌రావు రైతులకు చేసింది ఏమిటని ప్రశ్నించారు. ఈకార్యక్రమంలో కిసా న్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపతి రాజయ్య, ఉపాధ్యక్షుడు వెంకటరమణరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు హరిగోపాల్‌రావు, మాజీ జడ్పీటీసీ ముత్తె సత్తయ్య, నాయకులు సతీష్‌రావు, ఎనగందుల కృష్ణమూర్తి, వెంకటేశ్వర్‌రావు, గుం డ ప్రభాకర్‌, బుద్దె సిద్దార్థ, వెంకటరమణ, పత్తిపాక సంతోష్‌, మహేష్‌, స్వప్నరాణి పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 11:19 PM