Share News

ఆడపడుచులకు సర్కారు ‘సారె’

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:20 AM

ఆడపడుచులకు సర్కారు సారె అందించడానికి సిద్ధం చేశారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతోపాటు సంఘా ల్లో లేని మహిళలకు కూడా ఈసారి ఇందిరమ్మ చీర లను పంపిణీ చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా యం త్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే

ఆడపడుచులకు సర్కారు ‘సారె’

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఆడపడుచులకు సర్కారు సారె అందించడానికి సిద్ధం చేశారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతోపాటు సంఘా ల్లో లేని మహిళలకు కూడా ఈసారి ఇందిరమ్మ చీర లను పంపిణీ చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా యం త్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చీరలను ఆవిష్కరించారు. మాజీ ప్రధాని ఇంది ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈనెల 19న ఇందిరమ్మ చీరలతో పాటు కొత్త చేయూత పింఛన్లు ప్రారంభించాలని భావించగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డాయి. ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు చే యూత పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్నారు. ప్రభు త్వం ప్రతి సంవత్సరం స్వశక్తి మహిళలకు రెండు చీర లను యూనిఫామ్‌లాగా ఉండే విధంగా లక్ష్యంగా పెట్టుకొని మొదటి విడతలో ‘పాలపిట్ట’ రంగు డిజైన్‌ చీరలను పంపిణీ చేశారు. దాదాపుగా లక్ష చీరలను పంపిణీ చేశారు. ఈసారి ‘చిలకపచ్చ’ రంగు డిజైన్లతో చీరలను తయారుచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాలు, సిరిసిల,్ల వేములవాడ మున్సిపాలిటీలో 411 గ్రామైక్య సంఘాలు, 10853 స్వశక్తి సంఘాల్లో 1.11 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు మరో 35వేల మంది సంఘాల్లో లేని వారు ఉన్నారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన మహిళ లందరికీ చీరలు పంపిణీ చేసే విధంగా జిల్లాకు 1.45 లక్ష చీరలు అవసరం అవుతాయని నివేదిక పంపించ గా, జిల్లాకు ఇప్పటివరకు 1.41లక్షల చీరలు వచ్చాయి. వీటిని గోదాంలో భద్రపరిచారు. చీరల పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నారు.

సిరిసిల్లలో రూ.6.33 కోట్ల మీటర్ల ఆర్డర్లు

స్వశక్తి మహిళకు చీరలు.. నేతన్నలకు ఉపాధిని అందించే దిశగా రాజన్న సిరిసిల్ల జిల్లా మరమగ్గాల పరిశ్రమకు రూ.334 కోట్లతో చీరల ఉత్పత్తికి ప్రభుత్వం నిధులు కేటార ుుంచింది. 6.33కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు అందించారు. సిరిసిల్లలో దాదాపు 30352 వేల వరకు మరమగ్గాలు ఉన్నాయి. ఇందులో జియోట్యాగింగ్‌ చేసిన మరమగ్గాలు 27వేల వరకు ఉన్నాయి. ఇందులో స్వశక్తి చీరల ఉత్పత్తి 133 మ్యూచువల్‌ ఎయి డెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ(మ్యాక్స్‌)ల ద్వారా 11వేల మరమగ్గాలపైన ఉత్పత్తి జరుగుతుండగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేలమంది కార్మికు లు ఉపాధి పొందుతున్నారు. ఇప్పటి వరకు 5.50కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి పూర్తి చేశారు. మరో 10రోజుల్లో వస్త్ర ఉత్పత్తి పూర్తవుతుంది. సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న 95లక్షల చీరల్లో 10 లక్షల వరకు 9మీటర్ల గోచి చీరలు పెద్ద వాళ్లకు అందించడానికి ఉత్పత్తి జరుగుతోంది. సిరిసిల్లతోపాటు ఇతర జిల్లాల్లో ఉన్న కార్మికు లకు కూడా ఆర్డర్లు ఇచ్చారు.

Updated Date - Nov 19 , 2026 | 01:20 AM