Share News

ఐదు రోజుల పనిదినం కల్పించాలి

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:33 AM

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఐదు రోజుల పనిదినం కల్పించాలని, వారంలో శనివా రం సెలవు దినంగా ప్రకటించాలని ఎస్‌బీఐ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగాని మహేష్‌ కోరారు.

ఐదు రోజుల పనిదినం కల్పించాలి
సూర్యాపేటలో ఎస్‌బీఐ ఎదుట ఆందోళన చేస్తున్న బ్యాంకు ఉద్యోగులు

సూర్యాపేటటౌన్‌,జనవరి 27(ఆంధ్రజ్యోతి):కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఐదు రోజుల పనిదినం కల్పించాలని, వారంలో శనివా రం సెలవు దినంగా ప్రకటించాలని ఎస్‌బీఐ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగాని మహేష్‌ కోరారు. బ్యాంకు ఉద్యోగులతో కలిసి జిల్లాకేంద్రంలో మంగళవారం సమ్మె నిర్వహించారు. శనివారం సెలవు కావాలని బ్యాంకు ఉద్యోగులు పదేళ్లుగా పోరాటం చేస్తున్నామని, రెండు సంవత్సరా ల క్రితం కేంద్రం అంగీకరించినా నేటికీ అమలు చేయడంలేదని ఆరోపించా రు. ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంతకముందు అన్ని బ్యాంకుల యూనియన్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్‌ అసోసియేషన్‌ సెక్రెటరీ సీహెచ్‌. భాస్కర్‌, యూనియన్‌ బ్యాంకు సెక్రెటరీ నరేష్‌, కెనరా బ్యాంకు సెక్రెటరీ సట్టు రామకృష్ణ పాల్గొన్నారు.

కోదాడటౌన్‌: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని దినాలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ కోదాడలో అన్ని బ్యాంకుల యూనియన్లు బంద్‌ నిర్వహించాయి. ఆల్‌ ఇండియా అసోసియేషన్‌ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రధానశాఖ ఎదుట వివిధ బ్యాంకుల ఉద్యోగులు, సిబ్బంది నిరసన తెలిపారు. ఐదు రోజుల పని దినాల డిమాండ్‌ ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉందని, కేంద్ర ప్రభుత్వం దీనిపై మొండి వైఖరి వీడాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ శివకుమార్‌, చీఫ్‌ మేనేజర్‌ వీరస్వామి, శంకర్‌, వెంకటరత్నం, ఉమా మహేష్‌, చిట్టిబాబు, రాము, నందన్‌రెడ్డి, సౌజన్య, రమ్య, సాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 12:33 AM