Share News

ఆత్మగౌరవం కోసం పోరాటం...

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:27 PM

గ్రామ పంచాయతీల్లో సముచిత గౌరవం లభించడం లేదని ఉప సర్పంచులు ఇటీవల ఉద్యమ బాట పట్టారు. అ భివృద్థి పనుల్లో ఉపసర్పంచులు అడ్డుపడి పనుల్లో జా ప్యం జరుగుతుందని భావించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉపసర్పంచుల చెక్‌ పవర్‌ రద్దు కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసింది.

ఆత్మగౌరవం కోసం పోరాటం...

ప్రభుత్వ సంస్థల్లో సముచిత స్థానం కావాలి

పంచాయతీల్లో ఉపసర్పంచులకు గౌరవ వేతనం ఇవ్వాలి

మళ్లీ ఉద్యమాలకు సిద్ధమవుతున్న ఉపసర్పంచుల ఫోరం

కాసిపేట, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీల్లో సముచిత గౌరవం లభించడం లేదని ఉప సర్పంచులు ఇటీవల ఉద్యమ బాట పట్టారు. అ భివృద్థి పనుల్లో ఉపసర్పంచులు అడ్డుపడి పనుల్లో జా ప్యం జరుగుతుందని భావించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉపసర్పంచుల చెక్‌ పవర్‌ రద్దు కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకార్యాచరణ ప్రకటించడంతో ప్రభుత్వం చెక్‌ పవర్‌ రద్దును తాత్కాలికంగా విరమిం చుకుంది. కానీ ఎప్పటికైనా ఉపసర్పంచుల ఉనికి ప్ర మాదంలో ఉందని గమనించిన ఫోరం నాయకులు మ ళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.

సముచిత స్థానం కల్పించాలి..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉప పదవులకు ఇచ్చే గౌర వం స్థానిక సంస్థల్లో కనిపించడం లేదు. ఉపసర్పం చుల పై చులకనభావం వీడి సముచిత స్థానం కల్పిం చి గౌరవించాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి తెర లేపారు. చెక్‌ పవర్‌ ఒక్కటే కాదు. పంచాయతీల్లో జరిగే అభివృద్ధి శిలా ఫలకాలపై ఉప సర్పంచు, స్థానిక వార్డు సభ్యుల పేర్లను ముద్రించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలనే లక్ష్యంతో రాజ కీయాల్లోకి వచ్చిన ఉపసర్పంచు, వార్డు సభ్యులకు గౌర వ వేతనం ఇవ్వాలి. రాజ్యాంగ బద్దంగా జరిగే ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌ ద్వారానే ఎన్నుకోబడతామని, 24 గం టల వ్యవధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు సార్లు ఎ న్నికలను ఎదుర్కొనే ఏకైక వ్యక్తి ఉపసర్పంచు ఉపస ర్పంచులు మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెండా గౌరవ వందనంలో, 26 జనవరికి పంచాయతీ కార్యదర్శి, ఆగస్టు 15కు సర్పంచుకు జెండా ఎగురవేస్తున్నాడని, కానీ ఉపసర్పంచు నిర్లక్ష్యానికి గుర వుతున్నాడని, జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ అవకాశాన్ని ఉపసర్పం చులకు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో ఉద్యమ కార్యా చరణ చేపట్టబోతున్నారు.

ఆధిపత్య పోరు..

కొన్ని చోట్ల స్థానికంగా ఉండే సర్పంచు, ఉపసర్పం చుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరుతోంది. రిజర్వేషన్‌లో గెలిచిన సర్పంచులపై ఆధిపత్య కులాలు ఉపసర్పంచుగా ఉంటే వారిదే పై చేయి అవుతుంది. అ లాగే రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు సర్పంచు, ఉప సర్పంచులుగా ఉన్న చోట ప్రతి పనికి అడ్డంకిగా మా రుతుంది. వ్యక్తిగత కక్ష, పంచాయతీలో జరిగే ఆధిపత్య పోరు అభివృద్థికి ఆటంకంగా మారుతుందని సామాజి క విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

-2018 నుంచి అమలు

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని 2018లో అమలులోకి తెచ్చింది. ఇందులో ఇప్ప టి వరకు ఉన్న సర్పంచు, గ్రామకార్యదర్శికి ఉన్న చెక్‌ పవర్‌ను తొలగించి ఉపసర్పంచుకు అవకాశం కల్పిం చింది. దీనిపై అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తం కాగా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఉపసర్పంచులు చె క్కులపై సంతకాలు చేయకుండా జాప్యం చేస్తున్నారనే సర్పంచు, మండల పరిషత్‌ అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉపసర్పంచుల చెక్‌ పవర్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆలోచించింది. అయితే వారి చెక్‌ పవర్‌ను రద్దు చేస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర వుతాయనే ఉద్దేశ్యంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వే షిస్తున్నారు. సంతకం చేయడానికి నిర్ణీత గడువు విధిం చాలి. సకాలంలో సంతకం చేయకుంటే ఆ చెక్కుకు సంబంధించిన ప్రొసీడింగ్‌ను కలెక్టర్‌ జారీ చేసేలా అధికారులు నిర్ణయం తీసుకో నున్నారు.

మాకు గౌరవం ఇవ్వండి

అనుమాండ్ల విక్రమ్‌, ఉపసర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల

ప్రజల ఓట్లతో గెలిచిన మాకు ప్రభుత్వ సంస్థల్లో సరైన గౌరవం ఇవ్వాలి. మండల స్థాయిలో జరిగే స మావేశాల్లో సర్పంచు చైర్మన్‌ అయినప్పుడు ఉపసర్పం చును వైస్‌ చైర్మన్‌గా గుర్తించి సమావేశాలకు హ్వానిం చాలి. అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కల్పించాలి. ఉప సర్పంచు, వార్డుసభ్యులకు సరైన గౌరవ వేతనం ఇ వ్వాలి. పంచాయతీ నిధులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఉపసర్పంచులకు చెక్‌ పవర్‌ ఉందని గు ర్తించాలి. పారదర్శకతతో పాలన కొనసాగించేందుకు ఉపసర్పంచుల పాత్ర కీలకమైందని ప్రభుత్వం గుర్తించాలి.

Updated Date - Sep 13 , 2026 | 11:28 PM