Share News

నెరవేరనున్న కల...!

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:51 PM

జిల్లా కేంద్రంలోని రాళ్లవాగుపై ఉన్న లోలెవల్‌ స్థానంలో హై లెవల్‌ వంతెన నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభిం చింది.

నెరవేరనున్న కల...!

-రాళ్లవాగు వంతెన నిర్మాణానికి మోక్షం

-త్వరలో ప్రారంభం కానున్న పనులు

రూ. 23 కోట్లు అంచనా

-పూర్తయిన టెండర్‌ ప్రక్రియ

-ఆరు వరుసల రహదారికీ డీపీఆర్‌ సిద్ధం

మంచిర్యాల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని రాళ్లవాగుపై ఉన్న లోలెవల్‌ స్థానంలో హై లెవల్‌ వంతెన నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభిం చింది. వంతెనతోపాటు లక్ష్మీటాకీస్‌ చౌరస్తా నుంచి రం గంపేట మీదుగా పాత మంచిర్యాల హైవే వరకు, ఇటు ఎంసీసీ క్వారీ రోడ్డును ఆనుకొనేలా ఆరు వరుసల రహ దారి నిర్మాణానికీ డీపీఆర్‌ (డిటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌) సిద్ధంకాగా గత నెలలో టెండర్‌ ప్రక్రియ కూడా పూర్త యింది. వారం పది రోజుల్లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కానుండగా, స్థానిక ప్రజల దశాబ్దాల కల నె రవేరనుంది. నగరంలోని లక్ష్మీటాకీస్‌ ప్రాంతాన్ని, పాత మంచిర్యాల సమీపంలోని రంగంపేటను కలిపేలా 2005లో సుమారు రూ. 80 లక్షల అంచనా వ్యయంతో రాళ్లవాగుపై పైపులతో తాత్కాలిక వంతెన నిర్మించారు. బైపాస్‌ రోడ్డులోని తెలంగాణ అమరుల స్థూపం సమీ పంలోని వంతెన మీదుగా ఆయా ప్రాంతాల ప్రజలు ని త్యం రాకపోకలు సాగిస్తారు. పాలు విక్రయిస్తూ జీవ నం సాగించే రంగంపేట ప్రజలు, పాఠశాలలు, కళా శా లల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆటోలు, ద్విచక్ర వాహ నాల ద్వారా వంతెన మీదుగా ప్రయాణం చేస్తారు. ఇది లా ఉండగా, 2019లో కురిసిన భారీ వర్షాల కారణంగా కాజువే వరద ప్రవాహంలో మునిగి కుప్పకూలిపో యింది. తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టినప్పటికీ ప్రతియేటా వర్షాకాలంలో వంతెన రాళ్లవాగు ఉధృతికి కొట్టుకుపోతోంది. అయినప్పటికీ ఇంతకాలంపాటు శా శ్వత పరిష్కారం దిశగా కృషి జరగలేదు. దీంతో వర్షాకా లం వచ్చిందంటే చాలు కాజువేపై రాకపోకలు సాగిం చాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేవారు. కాల క్రమంలో రంగంపేట ప్రాంతం అభివృద్ధి చెం దడం, సమీపంలో కొత్త కాలనీలు ఏర్పాటు కావడంతో ప్రజల సౌకర్యార్థం హై లెవల్‌ బ్రిడ్జి నిర్మించాలనే ప్రతిపాధనలు తెరమీదికి వచ్చాయి. పాలకులు సైతం హై లెవల్‌ బ్రిడ్జి ఆవశ్యకతపై అనేక సార్లు ప్రస్తావనకు తెచ్చారు. అయితే దశాబ్దాలు గడిచినా వంతెన నిర్మా ణం కేవలం ప్రతిపాదనలకే పరిమితం అయిందిగానీ ఆచరణలోకి రాలేదు.

హైలెవల్‌ బ్రిడ్జి మంజూరు...

ప్రజల విన్నపాల మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కి రాల ప్రేంసాగర్‌రావు కాజువే స్థానంలో హై లెవల్‌ బ్రి డ్జి నిర్మాణం చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు. తెలం గాణ అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ (టీయూఎఫ్‌ఐడీసీ) నిధులు రూ. 13.50 కోట్లతో హై లెవల్‌ వంతెన నిర్మాణం చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో లోలెవల్‌ బ్రిడ్జి స్థా నంలో హై లెవల్‌ వంతెన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే 10 మార్చి 2024న భూమి భూమిపూజ చేయగా, సా యిల్‌ టెస్ట్‌ పనులు కూడా పూర్తయ్యాయి. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వంతెన పనులు ప్రారంభమవు తాయోనన్న కుతూహలం ఆయా ప్రాంతాల ప్రజల్లో ఉండగా, ఎట్టకేలకు పనులు ప్రారంభం అవుతుండటం తో దశాబ్దాల కాలంగా ఆయా కాలనీల ప్రజలు ప డుతున్న కష్టాలు తీరనున్నాయి.

222 మీటర్ల పొడవుతో నిర్మాణం...

అమర వీరుల స్థూపం వద్ద రాళ్లవాగుపై 222 మీ టర్ల పొడవుతో ఆరు వరుసలతో (రానుపోను) కూడిన హై లెవల్‌ వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. వంతెన ను 10 మీటర్ల ఎత్తుతో మొత్తం 10 పిల్లర్లతో నిర్మిం చనుండగా, రూ. 23 కోట్లకు టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయింది. వంతెనతోపాటే దానికి ఇరువైపులా లక్ష్మీ టాకీస్‌ చౌరస్తా వరకు, రంగంపేట మీదుగా పాత మం చిర్యాల వద్ద ఎన్‌హెచ్‌-63కి అనుసంధానం చేయను న్నారు. అలాగే రంగంపేట నుంచి ఎంసీసీ క్వారీ రోడ్డు కు దాదాపు 2.6 కిలో మీటర్ల పొడవుగల ఆరు వరు సల రహదారి నిర్మాణాన్ని రూ. 69 కోట్ల అంచనా వ్య యంతో చేపట్టనున్నారు. హై లెవల్‌ వంతెన, రహదారి నిర్మాణానికి గతనెల 18న టెండర్‌ ప్రక్రియ పూర్తికాగా, విజయవాడలోని వల్లభనేని కన్‌స్ట్రక్షన్స్‌కు పనులు అప్ప గించారు. అదే రోజు కాంట్రాక్టర్‌తో అగ్రిమెంటు పూర్తికా గా, గరిష్టంగా రెండేళ్లలోపు వంతెనతోపాటు రహదారి నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి.

తాత్కాలిక ఏర్పాట్లు చేపట్టాలి....

రాళ్లవాగుపై వంతెన నిర్మాణ పనులు ప్రారంభ మ య్యేలోపు ప్రజల రవాణా సౌకర్యం కోసం తాత్కాలిక ఏ ర్పాట్లు చేపట్టాలని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ఆర్‌అం డ్‌బీ అధికారులను ఆదేశించారు. గురువారం వంతెన ని ర్మాణ స్థలాన్ని ఆయన ఆర్‌అండ్‌బీ, మునిసిపల్‌ ఇంజ నీర్లు, మేయర్‌ ధరణి మధూకర్‌తో కలిసి పరిశీలించా రు. రాళ్లవాగుపై ఉన్న వంతెన పూర్తిగా కూలిపోయినం దున వారం రోజుల్లోగా వాహనాల రాకపోకలకు తా త్కాలిక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హై లెవల్‌ వంతెన నిర్మాణ సమయంలోనూ ప్రజలకు ఎలాంటి అ సౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

Updated Date - Oct 22 , 2026 | 11:52 PM