kumaram bheem asifabad- మత్తు పదార్థాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలి
ABN , Publish Date - Apr 29 , 2026 | 10:55 PM
జిల్లాలో గంజాయి సాగు చేసినా, వినియోగించినా, రవాణా చేసే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సమావేశానికి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, అదనపు ఎస్పీ చిత్తరంజన్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాలతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయి సాగు చేసినా, వినియోగించినా, రవాణా చేసే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సమావేశానికి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, అదనపు ఎస్పీ చిత్తరంజన్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాలతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు, గంజాయి వినియోగం, అక్రమ రవాణా చేసే వారిపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించడం వల్ల జరిగే నష్టాలపై ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. వైద్య బృందాలు, సిబ్బంది ప్రతి పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థుల మానసిక స్థితిని, ఆరోగ్య లక్షణాలను గుర్తించాలన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాలు అక్రమ రవాణా జరుగకుండా వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్నారు. మెడికల్ షాపులలో లభించే అధిక మోతాదు మందుల విక్రయాలపై తనిఖీ నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఆధార్‌కార్డు కలిగి ఉండాలి
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధార్‌కార్డు తప్పని సరి అని ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, అడిషనల్ ఎస్పీ చిత్తరంజన్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, యూఐడీఏఐ స్టేట్ అసిస్టెంట్ మేనేజర్ నరేష్‌లతో కలిసి కలెక్టర్ హరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు కలిగి ఉండాలన్నారు. 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ కార్డు తప్పని సరి అన్నారు. ఐదు సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు వయస్సు 13,781 మంది విద్యార్థులు ఆధార్ అప్‌డేట్ చేసుకోలేదని 15 సంవత్సరాలు దాటిన వారు 5130 మంది విద్యార్థులు ఇంకా ఆధార్ అప్‌డేట్ చేసుకోలేదని ప్రతి ఒక్కరు అప్‌డేట్ చేసుకోవాలన్నారు. నీట్, ఎంసెట్ పోటీ పరీక్షలకు బయో మెట్రిక్ హాజరు విధానం ఉంటుందని చెప్పారు. ఆధార్ అప్‌డేట్ కాక పోతే బయోమెట్రిక్ హాజరు సమస్య ఉంటుందని తెలిపారు. పుట్టిన తేది రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలన్నారు. పీవీటీజీ గ్రామాలలో ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు కలిగి ఉండేలా ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆధార్ కార్డులో వంద సంవత్సరాలు దాటిన వారి వివరాలు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. జిల్లాలో 87 ఆధార్ నమోదు కేంద్రాలు పని చేస్తున్నాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఈ- డిస్ట్రిక్ మేనేజర్ గౌతంరాజ్, తదితరులు పాల్గొన్నారు.