సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ప్రణాళిక
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:14 AM
డివిజన్‌లో నెలకొన్న సమస్యల పరిష్కా రానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని మేయర్ దర్ని మధుకర్ అ న్నారు. కార్పొరేషన్‌లోని 2వ డివిజన్‌లోని సీసీసీ, ఆర్‌కే-5 కాలనీల్లో శనివారం శుభ్రత -ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రగతి ప్రణాళికలో భాగంగా డివిజన్ లో కార్పొరేషన్ అధికారులతో క లిసి మేయర్ పర్యటించారు.
మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి) : డివిజన్‌లో నెలకొన్న సమస్యల పరిష్కా రానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని మేయర్ దర్ని మధుకర్ అ న్నారు. కార్పొరేషన్‌లోని 2వ డివిజన్‌లోని సీసీసీ, ఆర్‌కే-5 కాలనీల్లో శనివారం శుభ్రత -ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రగతి ప్రణాళికలో భాగంగా డివిజన్ లో కార్పొరేషన్ అధికారులతో క లిసి మేయర్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులను సమస్యలను అ డిగి తెలుసుకున్నారు. డివిజన్‌లో కావాల్సిన అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మేయర్ తెలిపారు. ఇళ్లలోని చెత్తను ఇష్టం వచ్చినట్లు బయట పడేయవద్దని సూచించారు. మున్సిప ల్ సిబ్బంది చెత్త బండితో వచ్చినప్పుడు బం డిలో వేయాలన్నారు. సిబ్బంది కూడా ము రుగు కాలువలు, చెత్త చెదారంను శుభ్రం చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రతకు అం దరూ కట్టుబడి ఉండాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే నివసించే ప్రజలు ఆ రోగ్యంగా వ్యాధులకు దూరంగా ఉంటారన్నా రు. అన్ని డివిజన్ల అభివృద్ధి కోసం శాయ శక్తుల కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్ర మంలో డిప్యూటి మేయర్ రమ్య, 2వ డివిజన్ కార్పొరేటర్ పుట్ట యశోధ, నాయకులు శ్రీని వాస్, అజయ్, కార్పొరేషన్ అధికారులు, సి బ్బంది, స్థానికులు పాల్గొన్నారు.