Share News

గంజాయి రహిత సమాజమే లక్ష్యం

ABN , Publish Date - Sep 09 , 2026 | 11:21 PM

గంజాయిరహిత సమాజమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు పోలీసులకు సహకరించాలని ఎవ రైన గంజాయివిక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని రామ గుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా తెలిపారు.

గంజాయి రహిత సమాజమే లక్ష్యం
మొక్కలు నాటుతున్న సీపీ అంబర్‌కిషోర్‌ఝా

సీపీ అంబర్‌కిషోర్‌ఝా

మందమర్రిటౌన్‌, సెప్టెంబరు9 (ఆంధ్రజ్యోతి): గంజాయిరహిత సమాజమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు పోలీసులకు సహకరించాలని ఎవ రైన గంజాయివిక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని రామ గుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా తెలిపారు. బుధవారం మందమర్రి సర్కిల్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. నేరాల నమోదు వివరాలను అడిగితెలుసుకున్నారు పోలీసుస్టేషన్‌కు అనుసంధానమైన సీసీ కెమె రాలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పోలీసుల విధివిధానాల్లో మార్పులు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఆదే శాల మేరకు ప్రజలతో స్నేహపూర్వకంగా మెదలడం జరుగుతుందని తెలిపారు. అంతేగాకుండా కేసుల సత్వర పరిష్కారానికి నూతన పద్ధ తులను అవలంభిస్తున్నామన్నారు. కమిషనరేట్‌ పరిధిలోని నేరాల ని యంత్రణకు సంబంఽధించి పకడ్బందీ ప్రణాళికలతో పని చేస్తున్నా మన్నారు. షీటీం మహిళ రక్షణకు పెద్దపీట వేస్తుందన్నారు. సింగరేణి గనులు ఉన్న ప్రాంతాల్లో భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. గంజాయికి బానిసైలనవారికి వారి మార్పు కోసం రిహాబిలే షన్‌కు తరలించి వారికి కౌన్సిలింగ్‌ ద్వారా వారికి జీవితాల్లో మార్పులు తీసుకొస్తున్నామన్నారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వం దనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, బె ల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్‌, సీఐ రమేశ్‌, మందమర్రి, రామకృ ష్ణాపూర్‌, దేవాపూర్‌, కాసిపేట ఎస్‌ఐలు పాల్గొన్నారు. అనంతరం ఆ యన పోలీసు స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు.

Updated Date - Sep 09 , 2026 | 11:21 PM