Share News

kumaram bheem asifabad- పుస్తకం ఓ మంచి నేస్తం

ABN , Publish Date - Nov 20 , 2026 | 10:10 PM

పుస్తకం మన వెంట ఉంటే మంచి నేస్తం తోడుగా ఉన్నట్లేనని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన 59వ జాతీయ గ్రంఽథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌కుమార్‌తో కలిసి హాజరయ్యారు

kumaram bheem asifabad- పుస్తకం ఓ మంచి నేస్తం

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): పుస్తకం మన వెంట ఉంటే మంచి నేస్తం తోడుగా ఉన్నట్లేనని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన 59వ జాతీయ గ్రంఽథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌కుమార్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం, ఆలోచన, పరిజ్ఞానం పెంపొందించుకోవడంతో పాటు జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన స్ఫూర్తి లభిస్తుందని తెలిపారు. గ్రంఽథాలయాలు విజ్ఞాన బండాగారాలుగా నిలుస్తున్నాయని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలు, గ్రంథాలయాలలో అందు బాటులో ఉంటాయని తెలిపారు. పూర్వం ఎంతో మంది ప్రముఖ నాయకులు, మేఽథావులు వివిధ అంశాలపై గ్రంథాలయాలలో సమావేశమై చర్చలు జరిపేవారని వివరించారు. ప్రతీ ఒక్కరు రోజువారి జీవితంలో పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో నిరం తరం అధ్యయనం చేస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమై ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం జాతీయ గ్రంఽథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీపీవో భిక్షపతి, మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్య, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మంగ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు అరిగెల నాగేశ్వర్‌రావు, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, కౌన్సిలర్లు భాగ్య లక్ష్మి, శారద, జ్యోతి, నాయకులు బాలేశ్వర్‌గౌడ్‌, జావీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2026 | 10:10 PM