Share News

అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

ABN , Publish Date - Sep 01 , 2026 | 11:15 PM

కల్వకుర్తి ప ట్టణ అభివృద్ధితో పాటు పే దల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంద ని ఎమ్మెల్యే కశిరెడ్డి నారా యణరెడ్డి అన్నారు.

అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట
లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లు అందజేస్తున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి

- ఎమ్మెల్యే నారాయణరెడ్డి

కల్వకుర్తి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : కల్వకుర్తి ప ట్టణ అభివృద్ధితో పాటు పే దల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంద ని ఎమ్మెల్యే కశిరెడ్డి నారా యణరెడ్డి అన్నారు. మంగళ వారం కల్వకుర్తి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఎల్లికల్‌లో రోడ్‌లో నిర్మించిన బ్రిడ్జిని ప్రారం భించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్ర్టీట్‌ వెం డర్లకు ప్రొసీడింగ్స్‌, స్మార్ట్‌రేషన్‌కార్డులు, సీఎం ఆర్‌ఎఫ్‌ చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ప్రజల అవసరాలకనుగుణంగా మరి న్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం పట్టణంలో హై మాస్ట్‌ లైట్లను ప్రారంభించారు. కార్యక్రమం లో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బృంగి రత్నమాల, పీసీ బీ సభ్యుడు ఠాకూర్‌ బాలాజీసింగ్‌, మాజీ స ర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌, జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు జిల్లెల రాము లు, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ షానవాజ్‌ఖాన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మనీలా సంజీవ్‌కు మార్‌ యాదవ్‌, తహసీల్దార్‌ ఇబ్రహీం, మునిసి పల్‌ కమిషనర్‌ మహమ్మద్‌షేక్‌, కౌన్సిలర్లు ప్ర జాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2026 | 11:21 PM