జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Jun 22 , 2026 | 11:07 PM
రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తాను కూడ జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తూ సంక్షేమానికి కృషి చేస్తానని కార్మిక ఉపాధి కల్పన గనులశాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు.
అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇస్తాం
మంత్రి జి. వివేక్ వెంకటస్వామి
మందమర్రిటౌన్, జూన్22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తాను కూడ జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తూ సంక్షేమానికి కృషి చేస్తానని కార్మిక ఉపాధి కల్పన గనులశాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. మందమర్రి ప్రెస్‌క్లబ్ నూతక కమిటీ పరిచ య కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ పాలనలో జర్నలిస్టులను పట్టించుకోలేదని విమర్శించారు. చాలా మంది జర్నలిస్టులు అక్రిడిడేషన్లు, ఇంటి స్థలాలు డబుల్‌బెడ్‌రూం గృహాలకు సంబంధించి చాలా సార్లు తన దృష్టికి తీసుకొచ్చామన్నారు. మందమర్రిలో 1/70 చట్టం వల్ల ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు సమస్య లు తలెత్తుతున్నాయన్నారు. ఇప్పటి వరకు అర్హులైన జర్నలిస్టులకు డ బుల్‌బెడ్‌రూం ఇళ్లు వచ్చేలా చూస్తానన్నారు. అంతేగాకుండా చాలా మంది విలేకరులు స్థానిక పరిశ్రమల్లో ఉపాధి గురించి తన దృష్టికి తీ సుకొచ్చారని తాను నేరుగా సంప్రదిస్తే ఉపాధి గురించి చర్చిస్తాన న్నా రు. తప్పుడు కథనాలు రాసి ప్రజలను ఇబ్బందులు పెట్టే జర్నలిస్టులు వారే ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృ త్వంలో ప్రభుత్వం ప్రగతి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. అ నంతరం ప్రెస్‌క్లబ్ సభ్యులు మంత్రిని శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ టి. రాజలింగు, తహసీల్దార్ సతీష్‌కుమార్, క్లబ్‌్ అధ్యక్షులు చందు, ప్రధాన కార్యదర్శి సలామోద్దీన్, కోశాధికారి చకినాల శంకర్, వర్కింగ్‌ప్రెసిడెంట్ కడారి శ్రీధర్, ముఖ్య సలహాదారుడు రహ్మత్‌ఖాన్, సభ్యులు పాల్గొన్నారు
పవర్ జిమ్‌ను ప్రారంభించిన మంత్రి
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 9వ వార్డులో ఆర్‌కేపీ ఎక్స్‌రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మారుతి పవర్ జిమ్‌ను సోమవారం రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంక టస్వామి ప్రారంభించారు. అనంతరం జిమ్‌లో ఏర్పాటు చేసిన ఆధుని క వ్యాయామ పరికరాలను పరిశీలించి నిర్వహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిమ్ నిర్వహకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.