మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దపీట
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:25 PM
క్యాతన్‌పల్లి మున్సిపాలిటి అభివృద్దికి పెద్దపీట వేయడంతో మున్సిపాటిని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ది చేస్తున్నామని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనులశాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం క్యాతన్‌పల్లి మున్సిపాలిటిలోని 3, 4, 19, 17 వార్డుల్లో పాదయాత్ర చేపట్టారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ప్రభుత్వం
మంత్రి వివేక్ వెంకటస్వామి
మందమర్రిటౌన్, జనవరి13(ఆంధ్రజ్యోతి): క్యాతన్‌పల్లి మున్సిపాలిటి అభివృద్దికి పెద్దపీట వేయడంతో మున్సిపాటిని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ది చేస్తున్నామని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనులశాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం క్యాతన్‌పల్లి మున్సిపాలిటిలోని 3, 4, 19, 17 వార్డుల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటిలోని 22 వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ ం చేపడుతూనే ఉన్నామని తెలిపారు. అంతేగాకుండా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు కూడ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో మున్సిపాలిటి అభివృద్ది కుంటుపడిందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మున్సిపాలిటిపై మున్సిపాలిటిపై ప్రత్యేక శ్రద్దపెట్టి పెద్ద ఎత్తున నిదులు తెచ్చానని తెలిపారు. ఓపెన్‌కాస్టు ప్రభావిత ప్రాంతాల ప్రజల పునరావాస సౌకర్యాలు కల్పించేందుకు సింగరేణి దృష్టికి తీసుకెళ్తానన్నారు. అంతేగాకుండా నిలిచిపోయినటువంటి 76వ జీఓను అమలు చేసి ఇండ్ల క్రమబద్దీకరించేందుకు రెవెన్యూ మంత్రితో మాట్లాడుతానని సింగరేణి భూముల్లో ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చేలా చర్యలు చేపడుతానన్నారు. అంతేగాకుండా మున్సిపాలిటిలోని అభివృద్దికి మరిన్ని నిధులు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. అనంతరం 3, 18వార్డుల్లో అభివృద్ది పనులకు శంఖు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జీఎం రాధాక్రిష్ణ, జిల్లా అద్యక్షులు రఘునాథ్ రెడ్డి, కమిషనర్ రాజు తదితరులు పాల్గొన్నారు.