గ్రామీణాభివృద్ధికి పెద్దపీట
ABN , Publish Date - Aug 01 , 2026 | 10:43 PM
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీ ట వేసి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు.
- ఎమ్మెల్యే గడ్డం వినోద్
నెన్నెల, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీ ట వేసి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. కేటాయింపుల్లో రోడ్డు, రవాణా, విద్య, వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. జోగాపూర్ క్రాస్ నుంచి మైలా రం వరకు రూ. 1.70 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు శనివారం శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. బీటీ రోడ్డుతో ఈ ప్రాంతవాసుల రవాణా ఇబ్బందులు తప్పుతాయన్నారు. రోడ్డు పనులు సత్వరం పూర్తి చేయాలని అధికారుకు సూచించారు. ఈ కార్యక్రమం లో డీసీసీ ఉపాధ్యక్షులు బొమ్మెన హరీష్‌గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు గ ట్టు మల్లేష్ పాల్గొన్నారు. సర్పంచులు జాడి రాజ్‌కుమార్, సుమలత, గంగా రాం, కామెర వనిత, గన్న సతీష్, జలంపల్లి భాస్కర్ పాల్గొన్నారు.