kumaram bheem asifabad- ప్రజా సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:05 PM
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తుందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. డీసీసీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినాయకత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వేయి రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని చెప్పారు. ఈ కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు
ఆసిఫాబాద్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తుందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. డీసీసీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినాయకత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వేయి రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని చెప్పారు. ఈ కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు. ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, ఉచిత విద్యుత్, పంటల కొనుగోళ్ల ద్వారా అండగా నిలిచిందన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి ద్వారా పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ ఆర్థిక బారం తగ్గించిందని చెప్పారు. పేదల సొంత ఇంటికలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు కొత్త రేషన్ కార్డులు లాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. అనంతరం నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరని తెలిపారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, నాయకులు బాలేశ్వర్‌గౌడ్, తారీక్, మురళీ, ఇమ్రాన్, మారుతి, ఇందిర, విజయలక్ష్మి, కమల తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి
ఆసిఫాబాద్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఉత్తరాఖండ్‌లో కుట్ర పూరితంగా నమోదు చేసిన అక్రమ కేసులను ఉప సంహరించు కోవాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని అంబేద్కర్‌చౌక్ ఎదుట డీసీసీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ కక్షతో రాహుల్‌గాంధీపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చేప్పకుండా కేసులు పెట్టి గొంతునొక్కాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. రాహుల్‌గాంధీపై నమోదుచేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేవవరు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, నాయకులు తారీక్, మురళీ, మారుతిపటేల్, విజయలక్ష్మి, ఇందిర, సోమశేఖర్, ఇమ్రాన్, తిరుపతి పాల్గొన్నారు.