Share News

kumaram bheem asifabad- 20 ఏళ్లుగా నిరీక్షణ

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:00 PM

గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషించే ఫీల్డ్‌అసిస్టెంట్లు 20 ఏళ్లుగా క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 15మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖ వీబీజీ రాంజీ(ఉపాధిహామీ పథకం)లో ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా కాంట్రాక్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తు న్న ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది

kumaram bheem asifabad- 20 ఏళ్లుగా నిరీక్షణ
లోగో

- జిల్లాలో 160 మంది ఉద్యోగులు

- పెరగని వేతనం.. దక్కని పదోన్నతులు

- ఇప్పటికైనా న్యాయం చేయాలని వినతి

బెజ్జూరు, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషించే ఫీల్డ్‌అసిస్టెంట్లు 20 ఏళ్లుగా క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 15మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖ వీబీజీ రాంజీ(ఉపాధిహామీ పథకం)లో ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా కాంట్రాక్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తు న్న ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జిల్లాలో గత 20ఏళ్లుగా 160మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారికి మాత్రం అరకొరగా వేతనాలు చెల్లిస్తున్నారు. వేతనాలు పెరగక. .సర్వీస్‌ను క్రమబ ద్ధీకరణ చేయక..పదోన్నతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని వాపోతున్నారు. గత కొన్ని ఏళ్లుగా పోరాడుతున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికా రులకు మొర పెట్టుకున్నప్పటికీ ఫలితం శూన్యమని చెబుతున్నారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనం రూ.12వేల ను నాలుగు నెలలకు ఓ సారి ఇస్తుండడంతో ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతు న్నారు. ఇటీవల పెరిగిన నిత్యావసర వస్తువుల ధర లకు ఇచ్చిన వేతనం సరిపోవడం లేదని వాపోతు న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీల్డ్‌ అసిస్టెంట్లను క్రమబద్దీకరించి కనీస వేతనం రూ.25వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

- వలసలను నివారించేందుకు..

యూపీఏ ప్రభుత్వం గ్రామాల్లో వలసలను నివా రించేందుకు 2006లో ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చారు. ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధి హామీ పథకం పేరుమార్చి వీబీజీ రాంజీ పథకంగా అమలు చేస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్‌ పద్దతిన ఉద్యోగు లను తీసుకున్నారు. వీరిని 2008లో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ద్వారా ఫీల్డ్‌ అసిస్టెం ట్లుగా విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం (పాత గ్రామపంచాయతీలు)160మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరంతా కాంట్రాక్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు.వీరు హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, చెరువులు, కుంటల్లో పూడికతీత, రోడ్ల నిర్మాణం, పండ్ల తోటల పెంపకం, ఇంకుగుడుం తలు, మరుగుదొడ్ల నిర్మాణం, గిరివికాస్‌, వైకుంఠధా మాలు, రోడ్లకిరువైపులా మొక్కలు నాటించడం, రైతుల చేలల్లో పనులు చేయించడంతో పాటు క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పనులు వీరు చేపడుతున్నారు.

- ఏళ్లతరబడి..

గ్రామీణ అభివృద్ధి శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఒకే పోస్టు...ఒకే ఉద్యోగంతో పని చేస్తున్నారు. దీంతో వచ్చే అరకొర వేతనంతో కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. 2014లో అప్పటి సీఎం కేసీఆర్‌ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను ఆదుకుంటామని చెప్పడంతో తమ ఉద్యోగాలు రెగ్యులర్‌ అవుతాయనే ఆశ పడ్డామని చెబుతున్నారు. తమను ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని, అరకొరగా వచ్చే వేతనాలు సైతం నెలనెలా రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ మైనా తమ కష్టాలను దృష్టిలో పెట్టుకొని తమను రెగ్యూలర్‌ చేయాలని కోరుతున్నారు.

కనీస వేతనం అమలు చేయాలి..

- దుర్గం రవి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, బెజ్జూరు

మాకు ప్రభుత్వం కనీస వేతనం అమలు చేయాలి. గత ఇరవై ఏళ్లుగా ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాము. పర్మనెంట్‌ ఉద్యోగులుగా గుర్తించి ప్రస్తుతం ఇస్తున్న రూ.12వేలు కాకుండా రూ.25వేలకు వేతనం అందించాలి.దీంతో పాటు తమ కు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎన్నికల్లో ఇచ్చిన మేని ఫెస్టో హామీలను నెరవేర్చాలి.

Updated Date - Sep 06 , 2026 | 11:00 PM