kumaram bheem asifabad- 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికను పక్కగా అమలు చేయాలి
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:14 PM
: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలో పక్కాగా అమలు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక అమలుపై ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర అధికారులతో కలిసి వీసీ ద్వారా కుమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్‌లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలో పక్కాగా అమలు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక అమలుపై ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర అధికారులతో కలిసి వీసీ ద్వారా కుమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్‌లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ పనులను వేగవంతం చేయాల చెప్పారు. భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, మరమ్మతులు ఏమైనా ఉంటే వెంటనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించాలని తెలిపారు. వేసవి కాలంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సీఎంఆర్ వ్యవహారంలో మిల్లర్ల నుంచి ధాన్యం రికవరీ, కేసుల పురోగతి వంటి అంశాలపై ఏప్రిల్ 30 నాటికి సమగ్ర నివేదిక అందించాలని తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను ఆధార్, బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయాల న్నారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం మోపాలని అన్నారు. ఇసుక అక్రమ రవాణా, మైనింగ్‌పై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం నుంచి కలెక్టర్ కెహరిత, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లాలో అధికారులతో సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.