Share News

‘పది’లో 98.57 శాతం ఉత్తీర్ణత...

ABN , Publish Date - Apr 30 , 2026 | 01:21 AM

పదో తరగతి పరీక్షల్లో జిల్లా ఉత్తమ ఫలితాలను సాధించింది. గత ఏడాదితో పోల్చితే పాస్‌పర్సంటేజీ కొంత పెరుగగా రాష్ట్రస్థాయిలో జిల్లా ర్యాంకు పడిపోయింది. గత ఏడాది 97.9 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లా ఆరో స్థానంలో నిలువగా ఈయేడు 98.57శాతం పాస్‌ పర్సంటేజీ సాధించినా

‘పది’లో 98.57 శాతం ఉత్తీర్ణత...

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

పదో తరగతి పరీక్షల్లో జిల్లా ఉత్తమ ఫలితాలను సాధించింది. గత ఏడాదితో పోల్చితే పాస్‌పర్సంటేజీ కొంత పెరుగగా రాష్ట్రస్థాయిలో జిల్లా ర్యాంకు పడిపోయింది. గత ఏడాది 97.9 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లా ఆరో స్థానంలో నిలువగా ఈయేడు 98.57శాతం పాస్‌ పర్సంటేజీ సాధించినా ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. గత ఏడాదితో పోల్చితే ఉత్తీర్ణత శాతం ఈ సంవత్సరం 0.67 శాతం పెరిగింది.

ఫ 12,949 మంది పాస్‌

జిల్లాలో 341 ప్రభుత్వ, ప్రైవేట్‌, గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ సంవత్సరం 13,137 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 12,949 మంది ఉత్తీర్ణులయ్యారు. 188 మంది విద్యార్థులు పెయిల్‌ అయ్యారు. ఉత్తీర్ణత సాధించిన రెగ్యులర్‌ విద్యార్థుల్లో 6,734 బాలురు, 6215 మంది బాలికలు ఉన్నారు. పరీక్షలకు 6,851 మంది బాలురు హాజరుకాగా వారిలో 6,734 మంది పాస్‌ అయ్యారు. 122 మంది బాలురు ఫెయిల్‌ అయ్యారు. మొత్తం 6,281 మంది బాలికలు పరీక్షలు రాయగా వారిలో 6215 మంది ఉత్తీర్ణులు కాగా 66 మంది ఉత్తీర్ణత సాధించలేక పోయారు. 2018-19 విద్యాసంవత్సరంలో 98.38శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకొని రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. 2019-20, 2020-21 విద్యాసంవత్సరాల్లో కోవిడ్‌-19 కారణంగా పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులందరిని పాస్‌ చేయడంతో వంద శాతం ఉతీర్ణత నమోదైంది. 2021-22 విద్యాసంవత్సరంలో 93.34శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. 2022-23లో 1.68శాతం మంది ఎక్కువగా ఉత్తీర్ణులు కావడంతో ఉత్తీర్ణతశాతం 95కి చేరింది. 2023-24లో 96.65శాతంగా పాస్‌ పర్సంటేజీ నమోదైంది. 2024-25 విద్యా సంవత్సరంలో 97.9 శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచింది. ఈయేడు 98.57శాతం ఉత్తీర్ణత సాధించినా రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో ర్యాంకుకు పరిమితమైంది.

ఫ గురుకుల విద్యార్థుల జయకేతనం

జిల్లాలో 11 మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉండగా వాటిలో 680 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 677 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 99.56 శాతం ఫలితాలను సాధించారు. ఐదు సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 390 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 390 మంది ఉత్తీర్ణులై వందశాతం ఫలితాలను సాధించడం గమనార్హం. తొమ్మిది మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 408 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 405 మంది ఉత్తీర్ణులయ్యారు. 99.26 ఉత్తీర్ణత శాతం నమోదైంది. 20 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 802 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరుకాగా 729 మంది ఉత్తీర్ణులయ్యారు. 90.9 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 12 కేజీబీవీల్లో 465 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా 463 మంది పాస్‌ కావడంతో 99.57శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండు ఎయిడెడ్‌ పాఠశాలల్లో 160 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 156 మంది పాస్‌ అయ్యారు. 97.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. 11 మోడల్‌ స్కూల్స్‌లో 920 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరుకాగా 918 మంది ఉత్తీర్ణులు కాగా ఇద్దరు ఫెయిల్‌ అయ్యారు. దీంతో 99.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 11 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో 2,676 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,619 మంది పాస్‌ అయ్యారు. 57 మంది ఫెయిల్‌ కావడంతో 97.87శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలోని 145 ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలల్లో 6,636 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా వారిలో 6,592 మంది ఉత్తీర్ణులు కాగా 44 మంది ఫెయిల్‌ అయ్యారు. ప్రైవేట్‌ పాఠశాలల ఉత్తీర్ణత శాతం 99.34 శాతం కాగా వంద శాతం ఉత్తీర్ణతతో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు.

Updated Date - Apr 30 , 2026 | 01:21 AM