Share News

రూ.30 కోట్ల ఆస్తి ఇచ్చినా

ABN , Publish Date - Jul 16 , 2026 | 06:36 AM

కోట్ల ఆస్తిని ఇద్దరు కొడుకులకు పంచి ఇచ్చిన ఆ వృద్ధురాలు ఇప్పుడు ఓ ముద్ద అన్నం కోసం అలమటిస్తోంది! ఓ కొడుకైతే తన బాగోగులను ఏమాత్రం పట్టించుకోకపోగా..

రూ.30 కోట్ల ఆస్తి ఇచ్చినా

  • తల్లికి బుక్కెడు బువ్వ పెట్టని కొడుకు!

  • ఆమె దాచుకున్న రూ.2.70 కోట్లూ స్వాహా.. తిరిగిచ్చేయాలని అడిగితే ఇంట్లోంచి గెంటివేత

  • 6 నెలలుగా కొడుకుపై న్యాయపోరాటం

  • ప్రజావాణి ద్వారా కలెక్టర్‌కు ఆమె ఫిర్యాదు

  • శంకర్‌పల్లిలో 82 ఏళ్ల వృద్ధురాలి కష్టమిది

  • ఆ కుమారుడిపై కేసు నమోదు

శంకర్‌పల్లి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): కోట్ల ఆస్తిని ఇద్దరు కొడుకులకు పంచి ఇచ్చిన ఆ వృద్ధురాలు ఇప్పుడు ఓ ముద్ద అన్నం కోసం అలమటిస్తోంది! ఓ కొడుకైతే తన బాగోగులను ఏమాత్రం పట్టించుకోకపోగా.. తాను దాచుకున్న 2.70 కోట్ల డబ్బునూ లాగేసుకున్నాడు. ఆపై ఇంట్లోంచే గెంటేయడంతో దిక్కుతోచని స్థితిలో ఆమె ఆరు నెలలుగా న్యాయపోరాటం చేస్తోంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం గాజులగూడ గ్రామానికి చెందిన కోమటిరెడ్డి సుశీలమ్మ అనే 82 ఏళ్ల వృద్ధురాలి వ్యధ ఇది! చిన్న కుమారుడికి తాను రూ.30 కోట్ల విలువ చేసే భూమిని ఇస్తే.. తాను దాచుకున్న డబ్బును ఇవ్వకుండా, తనను ఇంట్లోంచి పంపించి వేశాడని ఆ వృద్ధురాలు వాపోయింది. బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమె భర్త దేవిరెడ్డి యాభై ఏళ్ల క్రితమే చనిపోయాడు. సుశీలమ్మకు నలుగురు సంతానంలో అనంత్‌రెడ్డి, నర్సింహారెడ్డి కుమారులున్నారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లయ్యాయి. వారు అత్తగారింట్లో ఉంటున్నారు. వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలం చింతకుంటలో తన భర్త వాటాగా వచ్చిన 15 ఎకరాలను కుమారులకు సుశీలమ్మ సమానంగా పంచుతూ రిజిస్ట్రేషన్‌ చేసింది. శంకర్‌పల్లి మండ లం గాజులగూడలో తన పుట్టింటివారి నుంచి వాటాగా వచ్చిన 15 ఎకరాల్లో కూడా ఇద్దరికీ ఆరున్నర ఎకరాల చొప్పున రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చింది.


తన అవసరాల కోసం మిగిలిన రెండెకరాలను ఆమె విక్రయించింది. వచ్చిన రూ.2.70 కోట్ల నగదును చిన్న కుమారుడు నర్సింహారెడ్డి వద్ద దాచుకుంది. తాను దాచుకున్న డబ్బును తిరిగిచ్చేయాలంటూ ఆమె రెం డేళ్లుగా అడుగుతున్నా అతడు బుకాయిస్తూ వస్తున్నాడు. చివరికి గట్టిగా అడిగేసరికి.. ఆమె బాగోగులను పట్టించుకోవడం మానేశాడు. ఓ నెలరోజులైతే ఆమె కేవలం బ్రెడ్డు మాత్రమే తింటూ ఇంట్లో కాకుండా దాబాపైనే ఉన్నట్లు తెలిసింది. చివరికి నర్సింహారెడ్డి ఆమెను ఇంట్లోంచి వెళ్లిపోవాలని చెప్పడంతో ఆరు నెలల క్రితం శంకర్‌పల్లి పోలీసులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు చేవెళ్ల ఆర్డీవో వద్దకు వెళ్లింది.


మూడు నెలలుగా ఆర్డీవో కార్యాల యం చుట్టూ తిరుగుతున్నా తనకు న్యాయం జరగలేదని ఆమె వాపోయింది. చిన్న కుమారుడు నర్సింహారెడ్డి తన లాయర్‌తో ఆర్డీవో వద్దకొచ్చి తనకు నెలకు రూ.10వేలు ఇస్తానని ప్రతిపాదన పెట్టాడని, అందుకు తాను ఒప్పుకోలేదని సుశీలమ్మ చెప్పింది. తనకు నర్సింహారెడ్డి రెండెకరాల భూమి అయినా ఇ వ్వాలని, లేదంటే దాచుకున్న రూ.2.70కోట్లు అయినా ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేస్తోంది. ఈనెల 13న కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లిన సుశీలమ్మ అక్కడ ప్రజావాణిలో కుమారుడు నర్సింహారెడ్డిపై ఫిర్యాదు చేసింది. మూడు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామ ని ఆమెకు కలెక్టర్‌ హామీ ఇచ్చారు. మరోవైపు సుశీల మ్మ ఫిర్యాదు మేరకు నర్సింహారెడ్డిపై 318(4), 314, 351(2) బీఎన్‌ఎ్‌స సెక్షన్ల కింద కే సు నమోదు చేసినట్లు సీఐ మీర్‌ముదసిర్‌ ఆలీ తెలిపారు. కాగా ఒకప్పుడు బాగా బతికిన తనకు ఇప్పుడు బుక్కెడు బువ్వ కరువైందని సుశీలమ్మ కన్నీరు పెట్టుకుంది. తాను దాచుకున్న డబ్బు రూ.2.70 కోట్లను నర్సింహారెడ్డి నుంచి ఇప్పిస్తే.. ఎవ్వరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదని, తన అవసరాలు తీరతాయని, కొంత డబ్బు ఆడపిల్లల సంతానానికి ఇస్తానని చెప్పింది. పెద్దకుమారుడు అనంత్‌రెడ్డి ఎస్సైగా ఉద్యోగ విరమణ చేశాడు. ఆయన ఇటీవల గ్రామానికి తిరిగొచ్చి వ్యవసాయక్షేత్రంలో ఉంటున్నాడు. అక్కడే తాను ఉంటున్నానని, తన బాగోగులు పెద్ద కొడుకే చూసుకుంటున్నాడని సుశీలమ్మ చెప్పింది.నిజామాబాద్‌ జిల్లా బీర్కూర్‌ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన టేకు సతీష్‌ ఏడు నెలల తన పాపతో కలిసి మంగళవారం రాత్రి ఇంటిబయట నిద్రించాడు. బుధవారం ఉదయం నిద్ర లే చి చూసేటప్పటికి పాప ఇంటికి సమీపంలోని పొదల్లో గా యాలతో కనిపించింది. పాప చెవి, వీపు, మెడ, కాళ్లు, చేతులపై బ్లేడుతో కోసిన గాట్లు ఉన్నాయి. చికిత్స కోసం పాపను నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.

Updated Date - Jul 16 , 2026 | 06:37 AM