Share News

Teacher Eligibility Test: రెండో రోజు టెట్‌కు 81 శాతం హాజరు

ABN , Publish Date - Jan 05 , 2026 | 02:56 AM

రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు 81శాతానికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఆదివారం పేపర్‌-2 గణితం, సైన్స్‌ పరీక్ష జరగ్గా...

Teacher Eligibility Test: రెండో రోజు టెట్‌కు 81 శాతం హాజరు

రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు 81శాతానికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఆదివారం పేపర్‌-2 గణితం, సైన్స్‌ పరీక్ష జరగ్గా ఉదయం సెషన్‌కు 22,546 మందికిగాను 18,235 మంది (80.88 శాతం), మధ్యాహ్నం సెషన్‌కు 22,912 మందికిగాను 18,819 మంది (82.03 శాతం) హాజరయ్యారు. పాత అల్వాల్‌లోని అయాన్‌ డిజిటల్‌ జోన్‌లోని పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర పాఠశాల డైరెక్టర్‌, టెట్‌ చైర్మన్‌ నవీన్‌ నికోలస్‌ సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు. సోమవారం టెట్‌ పరీక్షలు ఉదయం 55 కేంద్రాల్లో, మధ్యాహ్నం 39 కేంద్రాల్లో జరుగుతాయని పాఠశాల విద్యా శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - Jan 05 , 2026 | 02:56 AM