Share News

రేపటి నుంచి ఆల్‌ ఇండియా పోలీస్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:02 AM

గచ్చిబౌలి స్టేడియం వేదికగా నిర్వహించనున్న 74వ బి.ఎన్‌. మల్లిక్‌ మెమోరియల్‌ ఆల్‌ ఇండియా పోలీస్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌-2026 బుధవారం ...

రేపటి నుంచి ఆల్‌ ఇండియా పోలీస్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌

  • ప్రారంభించనున్న గవర్నర్‌.. పాల్గొననున్న వివిధ రాష్ట్రాల జట్లు

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : గచ్చిబౌలి స్టేడియం వేదికగా నిర్వహించనున్న 74వ బి.ఎన్‌. మల్లిక్‌ మెమోరియల్‌ ఆల్‌ ఇండియా పోలీస్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌-2026 బుధవారం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాను డీజీపీ బి. శివధర్‌ రెడ్డి సోమవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను, దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తున్న పోలీసు జట్ల వివరాలను గవర్నర్‌కు వివరించారు. రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నీ మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల పోలీసు బృందాల గౌరవ వందనం స్వీకరణ, క్రీడాకారుల మార్చ్‌ పాస్ట్‌, ఆల్‌ ఇండియా పోలీసు క్రీడల పతాకావిష్కరణ వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు కేంద్ర భద్రతా బలగాల నుంచి ఫుట్‌బాల్‌ క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నారు.

Updated Date - Mar 24 , 2026 | 05:02 AM