72 అడుగుల మహా బతుకమ్మ ఏర్పాటు
ABN , Publish Date - Oct 16 , 2026 | 04:52 AM
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు.
17న అంబర్పేటలో వేడుకలు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
బర్కత్పుర, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. ఈ నెల 17వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించనున్న ఈ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు గురువారం ‘ఆంధ్రజ్యోతి’కి ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కోసం 72 అడుగుల మహా బతుకమ్మను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 20 టన్నుల వివిధ రకాల పూలను వినియోగిస్తున్నట్లు, ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్లా దంపతులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.