Share News

700 ఏళ్లుగా కొండెక్కని దీపం!

ABN , Publish Date - May 03 , 2026 | 04:45 AM

ఈ చిత్రంలోని దీపం సాధారణమైనది కాదు.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలోని అఖండ నందా దీపం ఇది. ఈ దీపం ఏకంగా 700 ఏళ్లుగా కొండెక్కలేదు

700 ఏళ్లుగా కొండెక్కని దీపం!

  • సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని

  • సీతారామస్వామి గుడిలో అఖండ నందా దీపం

ఈ చిత్రంలోని దీపం సాధారణమైనది కాదు.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలోని అఖండ నందా దీపం ఇది. ఈ దీపం ఏకంగా 700 ఏళ్లుగా కొండెక్కలేదు(ఆరిపోలేదు). అవును నిరంతరాయంగా వెలుగుతూనే ఉండడం విశేషం. కాకతీయుల చివరి రాజైన ప్రతాప రుద్రుడు పాలనలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు పూర్వీకులు చెబుతుంటారు. ఆలయంలో మూల విగ్రహ ప్రతిష్ఠకు ముందు ఈ అఖండ నందా దీపాన్ని వెలిగించారు. నాటి నుంచి నేటి వరకు ఆ దీపం కొండెక్కకుండా ఆలయ నిర్వాహకులు, భక్తులు తరతరాలుగా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. అఖండ జ్యోతి వెలిగితేనే తమ గ్రామం సిరిసంపదలతో తులతూగుతుందని గంభీరావుపేట ప్రజల విశ్వాసం. ఈ సీతారామాలయం 1333 సంవత్సరంలో నిర్మించినట్టు ఆలయంలోని గంటపై చెక్కిన తెలుగు అంకెల ఆధారంగా తెలుస్తోంది. ఇక, ఆలయంలో 16 స్తంభాలతో నిర్మించిన కల్యాణ మండపం(రాతి నిర్మాణం) ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఏటా శ్రీరామనవమికి ఈ మండపంలోనే సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ వేడుకను అఖండ దీపాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

- సిరిసిల్ల,

Updated Date - May 03 , 2026 | 04:45 AM