Share News

Maoists Surrender: ఛత్తీస్‌గఢ్‪లో 63 మంది మావోయిస్టుల లొంగుబాటు

ABN , Publish Date - Jan 10 , 2026 | 04:39 AM

ఛత్తీస్‌గఢ్‪లోని దంతెవాడ జిల్లాలో 63 మంది మావోయిస్టులు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో 18 మంది మహిళలు ఉన్నారు.

Maoists Surrender: ఛత్తీస్‌గఢ్‪లో 63 మంది మావోయిస్టుల లొంగుబాటు

చర్ల, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‪లోని దంతెవాడ జిల్లాలో 63 మంది మావోయిస్టులు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో 18 మంది మహిళలు ఉన్నారు. వారందరిపై రూ.కోటి 19 లక్షల 50 వేల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 63 మంది మావోయిస్టులు లొంగిపోవడం తమకు పెద్ద విజయమని జిల్లా ఎస్పీ గౌరవ్‌రాయ్‌ అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ఒడిశా, మాడ్‌, పశ్చిమ బస్తర్‌, దక్షిణ బస్తర్‌, దర్బా డివిజన్లలో పని చేశారని పేర్కొన్నారు. వారికి తక్షణ సాయం కింద నగదు అందించడంతో పాటు పునరావాసం కల్పిస్తామని ఎస్పీ తెలిపారు.

Updated Date - Jan 10 , 2026 | 04:39 AM