బహ్రెయిన్ నుంచి 60 మంది భారతీయుల రాక
ABN , Publish Date - Mar 12 , 2026 | 04:57 AM
బహ్రెయిన్‌లో చిక్కుకుపోయిన 60 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపిన చొరవపై తెలుగు కుటుంబాలు హర్షం వ్యక్తంచేశాయి.
హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): బహ్రెయిన్‌లో చిక్కుకుపోయిన 60 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపిన చొరవపై తెలుగు కుటుంబాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి బాధితులు ధన్యవాదాలు తెలిపారు. దమ్మామ్ నుంచి కొచ్చికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో పాటు సౌదీ అరేబియా నుంచి ట్రాన్సిట్ వీసాలు కల్పించడంలో కేంద్రం కీలక పాత్ర పోషించిందని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బహ్రెయిన్ తెలుగు అసోసియేషన్, గల్ఫ్ ఎయిర్, అలాగే బహ్రెయిన్‌లోని తెలుగు కుటుంబాలు తమకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించి అండగా నిలిచాయని వెల్లడించారు.