Share News

ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్క దాడి

ABN , Publish Date - Jan 28 , 2026 | 04:28 AM

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ప్రాంతంలో ఓ వీధి కుక్క రెచ్చిపోయింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ ఐదేళ్ల చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్క దాడి

  • ఐదేళ్ల బాలిక ముఖంపై తీవ్ర గాయం

ఖైరతాబాద్‌, జనవరి 27(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ప్రాంతంలో ఓ వీధి కుక్క రెచ్చిపోయింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ ఐదేళ్ల చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆ చిన్నారి అదృష్టవసాత్తు ప్రాణాలతో బయటపడినప్పటికీ.. బాలిక ముఖంపై తీవ్ర గాయమైంది. స్థానికుల కథనం ప్రకారం.. ఖైరతాబాద్‌ పాత కల్లు కాంపౌండ్‌ సమీపంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన పాక మల్లిఖార్జున్‌, రవళిల పెద్ద కుమార్తె శార్వి(5ఏళ్లు) ఎల్‌కేజీ చదువుతోంది. వరుస సెలవులతో ఇటీవల ఇంటివద్దే ఉన్న శార్వి మంగళవారం ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడంతో తల్లిదండ్రులు పాఠశాలకు పంపలేదు. దీంతో మంగళవారం ఉదయం 10.40 గంటల ప్రాంతంలో ఆడుకునేందుకు శార్వి తమ ఇంటి బయటకు వచ్చింది. ఆ వెంటనే ఓ వీధి కుక్క శార్విపై దాడి చేసింది. అటుగా వచ్చిన ఓ ద్విచక్రవాహనదారుడు తన వాహనాన్ని ఆపగానే శునకం పరారైంది. అయితే, శార్వి ఎడమ కన్ను కింద, చెంప, పెదవి భాగాల్లో తీవ్ర గాయమవ్వగా.. వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. కాగా, బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శార్విని జీహెచ్‌ఎంసీ వెటర్నరీ అధికారులతో పాటు ఖైరతాబాద్‌ జీహెచ్‌ఎంసీ వైద్యాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ పరామర్శించారు.

Updated Date - Jan 28 , 2026 | 04:28 AM