భద్రాద్రిలో బాలభీముడు
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:59 AM
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బాలభీముడు జన్మించాడు. ఆ శిశువు బరువు 5.2 కిలోలు ఉండటం విశేషం.
5.2 కిలోల బరువుతో ప్రభుత్వాస్పత్రిలో జననం
భద్రాచలం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బాలభీముడు జన్మించాడు. ఆ శిశువు బరువు 5.2 కిలోలు ఉండటం విశేషం. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం గ్రామానికి చెందిన సురేశ్ సతీమణి సంధ్యారాణి రెండో కాన్పు కోసం బుధవారం ఉదయం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో సంధ్యారాణికి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ, ఆర్‌ఎంవో డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ షంషాద్ బేగం, మల్లేశ్‌లు బుధవారం రాత్రి సిజేరియన్ చేయగా.. 5.2 కిలోల బరువున్న మగశిశువు జన్మించాడు.