51 Tehsildars to Retire: ఈ ఏడాది 51మంది తహసీల్దార్ల పదవీ విరమణ
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:48 AM
రెవెన్యూ శాఖలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్‌లో 61ఏళ్ల వయసు పూర్తై ఈ ఏడాది పదవీ విరమణ చేసే వారు 75మంది ఉన్నారు
హైదరాబాద్, జనవరి 19(ఆంధ్ర జ్యోతి): రెవెన్యూ శాఖలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్‌లో 61ఏళ్ల వయసు పూర్తై ఈ ఏడాది పదవీ విరమణ చేసే వారు 75మంది ఉన్నారు. తహసీల్దార్ క్యాడర్‌లో 51మంది, డిప్యూటీ తహసీల్దార్(నాయబ్ తహసీల్దార్) క్యాడర్‌లో 24మంది ఉన్నారని సీసీఎల్‌ఏ తెలిపింది. పదోన్నతుల ప్రక్రియ పెండింగ్ ఉండటంతో చాలా చోట్ల డిప్యూటీ తహసీల్దార్లు ఇన్‌ఛార్జి తహసీల్దార్లుగా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఉన్న ఖాళీలతోపాటు తాజాగా పదవీ విరమణ చేస్తున్న 51మంది తహసీల్దార్ల స్థానంలో అర్హులైన నాయబ్ తహసీల్దార్లకు అవకాశం కల్పించాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌కు ఇటీవల పలు సందర్భాలలో వినతి పత్రాలు అందజేశారు.