నార్లాపూర్ పంప్‌హౌస్‌కు రూ.50 కోట్లు
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:23 AM
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించడం ప్రభావం చూపుతోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని....
సీఎం రేవంత్ పర్యటన ప్రభావం
హైదరాబాద్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించడం ప్రభావం చూపుతోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్ పంప్‌హ్‌సకు విద్యుదీకరణ కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. ఈ పంప్‌హౌస్‌లో తొమ్మిది మోటార్లు బిగించాలని నిర్ణయించగా ఇప్పటికే 145 మెగావాట్ల చొప్పున సామర్థ్యం గల నాలుగు మోటార్లు బిగించారు. 2023లో ఈ పంప్‌హౌస్‌కు తాత్కాలికంగా కరెంట్ కనెక్షన్ అందించి... ఒక మోటార్ ట్రయల్‌రన్ చేసి, ఆ తర్వాత తొలగించిన విషయం విదితమే. తాజాగా సీఎం పర్యటన సందర్భంగా అధికారులు సమస్యను నివేదించడంతో రూ.50 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో పంప్‌హౌస్‌కు కరెంట్ రానుంది. ప్రస్తుతం నాలుగు మోటార్లతో ట్రయల్‌రన్ చేపట్టనున్నారు ఇక నార్లాపూర్ పంప్‌హౌస్ నుంచి 6.4 టీఎంసీల సామర్థ్యం కలిగిన నార్లాపూర్ రిజర్వాయర్లలోకి నీటిని పంపింగ్ చేపట్టనున్నారు. ఈ రిజర్వాయర్ కట్ట సామర్థ్యాన్ని కేంద్ర నీటి, విద్యుత్తు పరిశోధన కేంద్రం (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) పరిశీలించనుంది. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయ్యాక నీటిని నిల్వ చేయాలంటే విధిగా డ్యామ్ బ్రేక్ అనాలసిస్ స్టడీ చేయించాల్సి ఉంటుంది. ఇందుకు రూ.34లక్షలు కేటాయించారు. నార్లాపూర్‌లో నాలుగు మోటార్లు సిద్ధమైన వెంటనే నీటిని రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేయనున్నారు. ఈ పంప్‌హౌస్ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాక వరదల అనంతరం రానున్న ఫిబ్రవరి లేదా మార్చిలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో హెడ్ రెగ్యులేటరీ నిర్మాణం చేపట్టనున్నారు. దీనికన్నా ముందు కల్వకుర్తికి చెందిన ఎల్లూరు రిజర్వాయర్‌లోకి నార్లాపూర్ నుంచి నీటిని పంపింగ్ చేయనున్నారు. నార్లాపూర్ సిద్ధం కాగానే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద వివిధ కాంపోనెంట్లకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీరందనుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతోనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సాగునీరు అందుతున్న విషయం విదితమే. దాంతో సీఎం నిర్ణయంతో కీలకమైన సమస్యలకు పరిష్కారం లభించినట్లయింది. నిధుల విడుదలతో నార్లాపూర్‌లో పంపులు నడవనుండగా... అదే స్ఫూర్తితో కల్వకుర్తిలో మోటార్లు కూడా రిపేర్ కానున్నాయి.