Share News

తొలగిపోనున్న 46,392 ఓట్లు

ABN , Publish Date - Jul 28 , 2026 | 11:03 PM

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌)ప్రక్రియ చివరి దశకు చేరింది. ఎన్యూమరేషన్‌ ఫారాలు బీఎల్‌ఓలకు అందించేం దుకు ఆగస్టు 3 వరకు గడువు ఉంది. అప్పటిలోగానే డిజిటలైజేషన్‌ ప్రక్రియ కూడా పూర్తి కానుంది. ఇప్పటి వరకు జిల్లాలో 99 శాతం ఫారాల డిజిట లైజేషన్‌ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు చెబు తున్నారు.

తొలగిపోనున్న 46,392 ఓట్లు
:డిజిటలైజేషన్‌ను పరిశీలిస్తున్న తహసీల్దార్‌ రియాజ్‌ అలీ(ఫైల్‌)

  • ఇప్పటి వరకు 99 శాతం ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తి

  • మృతులు, వలస వెళ్లిన వారిని గుర్తిస్తున్న బీఎల్‌ వోలు

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌)ప్రక్రియ చివరి దశకు చేరింది. ఎన్యూమరేషన్‌ ఫారాలు బీఎల్‌ఓలకు అందించేం దుకు ఆగస్టు 3 వరకు గడువు ఉంది. అప్పటిలోగానే డిజిటలైజేషన్‌ ప్రక్రియ కూడా పూర్తి కానుంది. ఇప్పటి వరకు జిల్లాలో 99 శాతం ఫారాల డిజిట లైజేషన్‌ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు చెబు తున్నారు. మిగతా ఫారాలు తిరిగి తీసుకొవడంతో పాటు వాటిని ఆన్‌లైన్‌ చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. ముసాయిదా జాబితాలోంచి సుమారు 46,392 ఓట్లు తొలగించే అవకాశం ఉంది.

జిల్లాలో 678 పోలింగ్‌ కేంద్రాలు:

జిల్లాలో 678 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 4,55,596 మంది ఓటర్లు ఉన్నారు. ఆసిఫాబాద్‌ నియోజక వర్గంలో 2,26,680 మంది, సిర్పూర్‌ నియోజకవర్గంలో 2,28,916 మంది ఓటర్లు ఉన్నారు. బీఎల్‌వోలు ఇంటింటికీ తిరిగి వీరందరికి ఎన్యూమరేషన్‌ ఫారాలు అందించారు. ఇప్పటి వరకు ఆసిఫాబాద్‌ నియోజక వర్గంలో 2,02,854 మంది, సిర్పూర్‌ నియోజకవర్గంలో 2,02,919 మంది మొత్తం 4,05,773 డిజిటలైషన్‌ ప్రక్రియ పూర్తయింది. బీఎల్‌వోలు ఇప్పటి వరకు ఇంటింటికీ తిరిగి ఫారాలు తిరిగి తీసుకుంటూ వివరా లను 99 డిజిటలైజేషన్‌ చేశారు. పెంచికల్‌పేట, గాది గూడ, లింగాపూర్‌, తిర్యాణి, వాంకిడి మండలాల్లో ఇప్పటికే 100 శాతం పూర్తయింది.

తొలగించే ఓట్ల గుర్తింపు

ఎన్యుమరేషన్‌ ఫారాలను ఓటర్లు తిరిగి బీఎల్‌ వోలకు అప్పగించేందుకు ఆగస్టు 3వ తేదీ వరకు అవకాశం ఉంది. అదేరోజు వాటిని ఆన్‌లైన్‌ చేయను న్నారు. అర్హులైన ఓటర్లతో ముసాయిదా జాబితాను అదికారులు ప్రకటించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఓటర్లలో దాదాపు 46,392 మంది పేర్లు ముసా యిదా జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. ఇందులో మృతి చెందిన వారు, శాశ్వతంగా జిల్లా నుంచి వలస వెళ్లిన వారు, ఇతర ప్రాంతాల్లో ఓట ర్లుగా నమోదు అయినవారు, ఇతర కారణాలతో ఓ ట్లు తొలగిపోయే అవకాశం ఉంది. ఫారాలు అందిం చేందుకు మరో ఆరు రోజుల పాటు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సంఖ్యలో కొంతమేర మార్పులు ఉం డనున్నాయని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jul 29 , 2026 | 02:12 PM