ఐదేళ్లలో ఇసుక లారీలు ఢీకొని 46 మంది మృతి
ABN , Publish Date - Sep 01 , 2026 | 03:33 AM
రాష్ట్రంలో 2020 నుంచి 2025 వరకు ఐదేళ్లలో ఇసుక లారీల వల్ల జరిగిన ప్రమాదాల్లో 46 మంది మృతి చెందారు. 10 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.
ఆర్టీఐ కింద వివరాలు ఇచ్చిన మైనింగ్ శాఖ
హైదరాబాద్, ఆగస్టు31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2020 నుంచి 2025 వరకు ఐదేళ్లలో ఇసుక లారీల వల్ల జరిగిన ప్రమాదాల్లో 46 మంది మృతి చెందారు. 10 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. యూత్‌ఫర్ యాంటీ కరప్షన్ అనే సంస్థ అధ్యక్షుడు పలనాటి రాజేంద్ర ఆర్టీఐ కింద చేసిన దరఖాస్తుకు స్పందనగా గనుల శాఖ ఈ వివరాలు ఇచ్చింది. రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక లారీలు తిరుగుతున్నాయని, నదీ తీర గ్రామాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉందని రాజేంద్ర తెలిపారు. వాటికి నిర్ధిష్ట సమయాలను కేటాయించి ప్రమాదాలను నివారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.