వెలుగుమట్ల భూదాన్ బాధితుల్లో.. 412 మంది లబ్ధిదారుల గుర్తింపు
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:17 AM
ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల ‘భూదాన్’ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ....
ఖమ్మం/గన్ పార్కు/పంజాగుట్ట, మార్చి 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల ‘భూదాన్’ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బాధితుల్లో 412 మందిని లబ్ధిదారులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వారికి మంగళవారం రెవెన్యూ అధికారులు టోకెన్లు పంపిణీ చేశారు. కాగా, వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీల జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ చెప్పారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి జేఏసీ కార్యాలయంలో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. మరోవైపు, తమ ప్రాణాలు పోయినా భూమిని వదలబోమని వెలుగుమట్ల బాధితులు, పేదల సంఘం నేతలు తెలిపారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో వారు మీడియాతో మాట్లాడారు.