Share News

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - May 04 , 2026 | 04:58 AM

వేసవి సెలవులు, ఆదివారం కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సుమారు 40వేల మంది ...

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట, మే 3(ఆంధ్రజ్యోతి): వేసవి సెలవులు, ఆదివారం కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సుమారు 40వేల మంది భక్తులు స్వయంభువులను దర్శించుకోగా, ప్రత్యేక దర్శనానికి గంట సమయం, ధర్మదర్శనానికి 2గంటల సమయం పట్టింది. ప్రధానాలయం, వ్రత మండపాలు, ఆలయ తిరువీధులు, ప్రసాద టికెట్‌ కౌంటర్లు, విక్రయశాలల వద్ద భక్తుల సందడి నెలకొంది. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.41,81,364 ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈవో జే.భవానీశంకర్‌ తెలిపారు.

Updated Date - May 04 , 2026 | 04:58 AM