Share News

kumaram bheem asifabad- జిల్లాలో 40 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

ABN , Publish Date - May 12 , 2026 | 10:11 PM

రైతులకు ఇబ్బందులు కలుగకుండా జిల్లాలో 40 ధాన్యం కొనుగోలు కంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబందిత అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు

kumaram bheem asifabad- జిల్లాలో 40 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
:వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ హరిత, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా

ఆసిఫాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఇబ్బందులు కలుగకుండా జిల్లాలో 40 ధాన్యం కొనుగోలు కంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబందిత అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి నిబంధనల ప్రకారం నాణ్యమైన దాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో నగదు జమ చేస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని కొనుగోలు ప్రక్రియ వేగంగా చేపట్టాలని చెప్పారు. అకాల వర్షాల నేపథ్యంలో దాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ కె హరిత, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మార్క్‌ఫెడ్‌ ద్వారా మొక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. యాసంగి ధాన్యం కొనుగోలు కోసం 40 కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. 9 కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో గోనెసంచుల కొరత లేదని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ వివరించారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తరావు, డీఎస్‌ఓ మోహన్‌, డీటీవో రాంచందర్‌, మార్కెటింగ్‌ అధికారి ఆశ్వక్‌ ఆహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2026 | 10:11 PM