Share News

చాక్లెట్‌ ఇప్పిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిపై హత్యాచారం

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:50 AM

నాలుగేళ్ల చిన్నారికి చాక్లెట్‌ ఇప్పిస్తానని తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఆపై చిన్నారి ఇంట్లో విషయం చెబుతుందని భయపడి....

చాక్లెట్‌ ఇప్పిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిపై హత్యాచారం

నార్సింగ్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): నాలుగేళ్ల చిన్నారికి చాక్లెట్‌ ఇప్పిస్తానని తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఆపై చిన్నారి ఇంట్లో విషయం చెబుతుందని భయపడి, బండరాయితో తలపై మోది హత్య చేశాడు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నానక్‌రాంగూడ- పుప్పాలగూడ ప్రాంతంలో ఓ భవన నిర్మాణ కంపెనీ ఏర్పాటు చేసిన లేబర్‌ క్యాంపులో ఉండే తల్లిదండ్రులు ఆదివారం పనికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి కూతురు కనిపించకపోవడంతో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిశ్వా అలియాస్‌ బిస్సు (25) అనే కార్మికుడు చాక్లెట్‌ కోసం ఆ చిన్నారిని తీసుకెళ్లాడని ప్రాథమికంగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, మద్యం మత్తులో చిన్నారిపై అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపి అక్కడి చెట్ల పొదల్లో వేసినట్లు ఒప్పుకొన్నాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు నార్సింగి ఏసీపీ రమణగౌడ్‌ తెలిపారు.

Updated Date - Mar 17 , 2026 | 04:50 AM