Share News

కుళ్లిన మాంసం సరఫరా ముఠా గుట్టురట్టు

ABN , Publish Date - Apr 11 , 2026 | 04:48 AM

హైదరాబాద్‌లోని పలు హోటళ్లు, దుకాణాలకు కుళ్లిన మేక తలకాయ మాంసం, చేపలు సరఫరా చేస్తున్న ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

కుళ్లిన మాంసం సరఫరా ముఠా గుట్టురట్టు

  • బాలాపూర్‌లో నలుగురి అరెస్టు.. పరారీలో ముఠా యజమాని

హైదరాబాద్‌ సిటీ/పహాడీషరీఫ్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని పలు హోటళ్లు, దుకాణాలకు కుళ్లిన మేక తలకాయ మాంసం, చేపలు సరఫరా చేస్తున్న ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా యజమాని పరారీలో ఉన్నాడు. బాలాపూర్‌లోని షాహిన్‌ నగర్‌, షాజహాన్‌ కాలనీలో కొందరు కుళ్లిన మేక తలకాయ/ కాళ్ల మాంసం, చేపలను సరఫరా చేస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలపూర్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు శుక్రవారం అకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో 4 టన్నుల కోడి వ్యర్థాలు, 6 టన్నుల కుళ్లిన మేక తలకాయ/ కాళ్ల మాంసం/ బోటి, 2 టన్నుల కుళ్లిన చేపలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులు మెఫీద్‌ ఖాన్‌, గులాం ఉస్మానీ, షేక్‌ మున్నా షైల్‌, మహ్మద్‌ ముజీబ్‌లను అరెస్టు చేసి విచారించగా.. వట్టేపల్లి వాసి అబ్ధుల్‌ గఫార్‌ అనే వ్యక్తి ఐదేళ్లుగా అక్కడ షెడ్డు వేసి ఈ దందాతో డబ్బు సంపాదిస్తున్నట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 11 , 2026 | 04:48 AM