Share News

35 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:30 AM

తెలంగాణలో 35 మంది ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ శివధర్‌ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ..

35 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 35 మంది ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ శివధర్‌ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పదోన్నతులు పొందిన డీఎస్పీలకు పోస్టింగ్‌లు మాత్రం ఇవ్వలేదు. నూతన డీజీపీ సీవీ ఆనంద్‌ మే నెల 1వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో డీఎస్పీ పోస్టింగ్‌లు వచ్చే నెల మొదటి వారంలో రావచ్చని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.

12 మంది ఐఎఫ్ఎస్‌ అధికారుల బదిలీ

రాష్ట్రంలోని 12 మంది ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్ఎస్‌) అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Apr 30 , 2026 | 05:30 AM