34 శాతం ఫిక్స్..
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:13 PM
సింగరేణి సంస్థ గడిం చిన లాభాలను ఎట్టకేలకు ప్రకటించింది. మంగళవారం డిప్యూటీ సీఎం, గనులశాఖ మంత్రి భట్టి విక్రమార్క, 2025-26 ఆర్థిక సంవ త్సరానికిగాను సంస్థ ఆర్జించిన నికర లాభం రూ. 1754 కోట్లుగా ప్రకటించారు.
సింగరేణి కార్మికులకు లాభాల వాటా
-ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
-2025-26లో లాభాలు రూ. 1754 కోట్లుగా ప్రకటన
-కార్మికుల వాటాకింద కేటాయించింది రూ. 596 కోట్లు
-ఒక్కో కార్మికుడికి సగటున రూ. లక్షా 54వేల పై చిలుకు
-కాంట్రాక్టు కార్మికులకు రూ. 5,500
మంచిర్యాల, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ గడిం చిన లాభాలను ఎట్టకేలకు ప్రకటించింది. మంగళవారం డిప్యూటీ సీఎం, గనులశాఖ మంత్రి భట్టి విక్రమార్క, 2025-26 ఆర్థిక సంవ త్సరానికిగాను సంస్థ ఆర్జించిన నికర లాభం రూ. 1754 కోట్లుగా ప్రకటించారు. అందులో 34 శాతం సొమ్ము అంటే రూ. 596 కో ట్లను కార్మికుల వాటాగా బోనస్‌గా ప్రకటించారు. ఈ లెక్కన సం స్థలో పని చేస్తున్న 41వేల మంది కారికులకు ప్రకటించిన ప్రకారం 34 శాతం లాభాల బోనస్ కింద ఒక్కొక్కరికి సగటున రూ. 1,54, 000 వరకు లభించనున్నాయి. గత ఏడాది సగటున ఒక్కో కార్మి కుడికి రూ. 1,95,610 లాభాల బోనస్ చెల్లించగా, దానితో పోల్చితే ఈ ఏడాది ఒక్కో ఉద్యోగికి రూ. 41,610 వరకు లాభాల బోనస్ త గ్గనుంది. ఇదిలా ఉండగా సింగరేణి నికర లాభాలు, కార్మికుల వాటా ప్రకటించడంలో సుదీర్ఘంగా జాప్యం జరిగింది. ఆర్థిక సంవ త్సరం ముగిసి ఏడు నెలలు గడుస్తుండటంతో ఎట్టకేలకు లాభా ల వాటా ప్రకటనకు మోక్షం లభించినట్లయింది. అదే కోలిండి యాలో ప్రతీ త్రైమాసికానికి ఒకసారి లాభాలను ప్రకటిస్తుండగా, సింగరేణిలో మాత్రం సుదీర్ఘకాలం పాటు జాప్యం జరగడం పట్ల కార్మికులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆ ర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే ఆడిట్ నిర్వహించి లాభాలను ప్రకటించాల్సి ఉంది. కొన్నేళ్లుగా లాభాల ప్రకటనకు ప్రభుత్వం ఆ రేడు నెలల సమయం తీసుకుంటున్నారు.
58 మిలియన్ టన్నుల ఉత్పత్తి...
2025-2026 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి అన్ని ఏరియాల్లో కలిపి మొత్తంగా 58 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధిం చింది. గత ఏడాదితో పోల్చితే కొంతమేర ఉత్పత్తి తగ్గినప్పటికీ, అంచనాల ప్రకారం నికర లాభం రూ. 2600 కోట్ల పైచిలుకు ఉం టుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు భిన్నంగా కేవలం రూ. 1754 కోట్లుగా ప్రకటించడంపట్ల కార్మిక సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పైగా సింగరేణి లాభాలను ప్రకటించేముందు గుర్తింపు సంఘం ప్రతినిధులను ఆహ్వానించా లన్న ఆనవాయితీని తుంగల్లో తొక్కారన్న విమర్శలు ఉన్నాయి. లా భాల ప్రకటన సమయంలో కోల్‌బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలను ఆ హ్వానించినప్పటికీ కేవలం కొత్తగూడెం శాశసన సభ్యుడు కూనమ నేని సాంభశివరావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని పిలవక పోవడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తగ్గినట్లు గా చూపుతున్న లాభాలపై ప్రశ్నిస్తారన్న ఉద్దేశ్యంతోనే వీరిని ఆహ్వానించలేదన్న విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.
ఏటేటా పెరుగుతున్న లాభాలు.....
సింగరేణిలో ప్రతీ ఏటా ఉత్పత్తి లక్ష్యం మేరకు జరుగుతుండగా అదే స్థాయిలో నికర లాభాలను కూడా సంస్థ ఆర్జిస్తోంది. 2013- 14లో రూ. 11,928 కోట్లుగా ఉన్న అమ్మకాలు 123 శాతం వృద్ధితో గత ఏడాదికి రూ. 26,607 కోట్లకు చేరుకున్నాయి. లాభాలు కూడా గరిష్టంగా 193 శాతానికి పెరిగాయి. 2013-14లో రూ. 419 కోట్లు నికర లాభం సాధించగా 1999-2000లో రూ. 300 కోట్ల లాభాలు ఆర్జించింది. అందులో యాజమాన్యం 10 శాతం బోనస్ ప్రకటించ గా, రూ. 30 కోట్లు మాత్రమే కార్మికుల వాటాగా లభించింది. 2000-21లో రూ. 805 బోనస్ ప్రకటించగా, 2021-22 నాటికి రూ. 1227 కోట్ల రూపాయలను సంస్థ ఆర్జించింది. అలాగే 2023-24లో సంస్థ సాధించిన టర్నోవర్‌పై కార్మికులు లాభాల వాటా కింద 33 శాతాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2024-25లో రూ. 6,394 కోట్ల టర్నోవర్ సాధించగా, కార్మికుల వాటా కింద అందులో 34 శాతం ప్రకటించారు. ఇక ఈ ఏడాది రూ. 1754 కోట్లు లాభాలు గడిం చగా, గతేడాది మాదిరిగానే కార్మికుల వాటా 34 శాతం ప్రకటిం చారు. ఈ సంవత్సరం కార్మికులు, జాతీయ కార్మిక సంఘాల నా యకులు 35 శాతం వాటా కోసం డిమాండ్ చేశారు. ప్రభుత్వం దాన్ని 34 శాతానికి పరిమితం చేసి లాభాల వాటాను కార్మికులకు అందజేయనున్నట్లు ప్రకటించింది. గత ఎనిమిదేండ్ల కాలంలో ప్రగతి బాటన పయనిస్తున్న కంపెనీ ఏటేటా తన లాభాలను పెంచుతూ వస్తుండగా, అనూహ్యంగా ఈ సంవత్సరం లాభాలు రూ. 1754 కోట్లకు పడిపోవడం గమనార్హం.
కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5,500 చెల్లింపు....
పర్మినెంట్ కార్మికులకు లాభాల్లో 34 శాతం వాటాను ప్రకటిం చిన సింగరేణి యాజమాన్యం సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా ఒక్కొక్కరికి రూ. 5,500 బోనస్ ప్రకటించింది. గతేడాది మాదిరిగానే కాంట్రాక్టు కార్మికులకు అంతే మొత్తం చె ల్లిస్తూ నిర్ణయం తీసుకుంది. యాజమాన్యం నిర్ణయంతో సంస్థలో పని చేస్తున్న 30వేల మంది కాంట్రాక్టు కార్మికులకు లబ్ది చేకూరనుంది.
ఏకపక్ష నిర్ణయం సరికాదు....వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ అధ్యక్షులు
లాభాల వాటా ప్రకటించడంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవ హరించింది. లాభాల వాటా విషయమై డిప్యూటీ సీఎం, సీఎం డీలతో చర్చకు పట్టుపట్టగా, తప్పుదోవ పట్టించి ఏకపక్ష నిర్ణయం తో లాభాల వాటాను ప్రకటించడం సమంజసం కాదు. ఈ ఏడాది లాభాలను తగ్గించి చూపారు. రూ. 2600 కోట్లకు పైగా లాభాలు ఆర్జించినట్లు సమాచారం ఉంది. అయినా రూ. 1754 కోట్లుగా ప్ర కటించిన ప్రభుత్వం మిగతా సొమ్మును ఎక్కడికి మళ్లించిందో వెల్లడించాల్సిన అవసరం ఉంది. పైగా లాభాల ప్రకటన సమావే శానికి గుర్తింపు సంఘం ప్రతినిధులను ఆహ్వానించకపోవడంపై అ నుమానాలు ఉన్నాయి. మరోవైపు సమావేశానికి కోల్‌బెల్ట్ ఎమ్మె ల్యేలందరినీ పిలిచిన ప్రభుత్వం కేవలం కొత్తగూడెం, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడం వెనుక అంతర్యమేమిటన్నది కార్మికులు గుర్తెరుగుతారు.