Share News

గోదాంలో గోల్‌మాల్‌

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:47 AM

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలోని ఓ గ్యాస్‌ ఏజెన్సీ గోదాంలో వందలాది సిలిండర్లు మాయమయ్యాయి. గృహాల్లో వినియోగించే సిలిండర్లను హోటళ్లు...

గోదాంలో గోల్‌మాల్‌

  • అచ్చంపేటలోని ఓ గ్యాస్‌ గోదాం నుంచి బ్లాక్‌ మార్కెట్‌కు 300 సిలిండర్లు

అచ్చంపేట, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలోని ఓ గ్యాస్‌ ఏజెన్సీ గోదాంలో వందలాది సిలిండర్లు మాయమయ్యాయి. గృహాల్లో వినియోగించే సిలిండర్లను హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లకు డీలర్లు అక్రమం గా తరలిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. స్పందించిన అధికారులు వాణిజ్య కేంద్రాల్లో ఆదివారం నుంచి విస్తృత తనిఖీలు చేపట్టి అక్రమంగా వినియోగిస్తున్న 41 డొమెస్టిక్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గోదాంలో తనిఖీ చేయగా.. వినియోగదారులు బుక్‌ చేసుకున్నవి పోను మిగిలిన 300 సిలిండర్లు లెక్కలో లేకుండా పోయాయి. వాటిని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించినట్లు గుర్తించామని, డీలర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసి, కలెక్టర్‌కు నివేదిక పంపిస్తామని తహసీల్దార్‌ సైదులు తెలిపారు.

Updated Date - Mar 17 , 2026 | 04:47 AM