Share News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 3 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

ABN , Publish Date - May 31 , 2026 | 05:10 AM

బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌కు గంజాయి తీసుకొచ్చిన ఓ ప్రయాణికుడిని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 3 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

  • బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద గుర్తింపు

శంషాబాద్‌ రూరల్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌కు గంజాయి తీసుకొచ్చిన ఓ ప్రయాణికుడిని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. ఆ ప్రయాణికుడు వద్ద దాదాపు 3కోట్ల విలువైన 7.18 కిలోల హైడ్రోపోనిక్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... బ్యాంకాక్‌ నుంచి క్యాథేపసిఫిక్‌ సీఎక్స్‌ 673 విమానంలో దీపిక్‌ జోస్కిటీ అనే ప్రయాణికుడు శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో చేసిన తనిఖీల్లో అతని బ్యాగు లో దాదాపు 7.18 కేజీల హైడ్రోపోనిక్‌ గంజాయిని కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. గంజాయిని సీజ్‌ చేసి నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, గంజాయి రవాణా కేసులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇటీవల పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లో 5రోజులు కస్టమ్స్‌ అధికారులు గంజాయి అక్రమ రవాణా కేసులు నమోదు చేశారు.

Updated Date - May 31 , 2026 | 05:10 AM